E-Paper
Advertisement

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !
Advertisement

World Cup 2027:  2027 వన్డే వరల్డ్ కప్ (Odi world cup 2027 ) కోసం ఇప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు తాజాగా వరల్డ్ కప్ ఫార్మాట్ (world cup 2027 format ) కూడా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో తరహాలో కాకుండా.. పెద్ద జట్ల మధ్య ఎక్కువ మ్యాచులు జరిగేలా చర్యలు తీసుకుంటుంది. కొత్త ఫార్మాట్ ప్రకారం రౌండ్ 1 , రౌండ్ 2 అలాగే సూపర్ 7 స్టేజీలు జరుగుతాయి. అనంతరం నాకౌట్ మ్యాచులు ఉంటాయి. అయితే ఈ కొత్త ఫార్మాట్ చాలా మందికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే వన్డే వరల్డ్ కప్ కొత్త ఫార్మాట్ ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య మూడు మ్యాచ్ లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఫాన్స్ సంబరపడుతున్నారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో కొత్త ఫార్మాట్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకువచ్చింది. దీని ప్రకారం పెద్ద జట్ల మధ్య ఎక్కువ మ్యాచులు జరుగుతాయి. ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా ఉండేలా ఐసీసీ ప్లాన్ చేసింది. చిన్న జట్లకు ఈ కొత్త ఫార్మేట్ కారణంగా పెద్దగా మ్యాచులు ఉండవు. అంతేకాదు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు జరుగుతాయి. కనీసం రెండు అయినా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగేందుకుగాను ఐసీసీ అలాగే బీసీసీఐ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీ కి లాభం చేకూర్చేందుకుగాను, తెరపైకి కొత్త ఫార్మాట్ తీసుకువచ్చారని ఆరోపణలు కూడా చేస్తున్నారు.

ముఖేష్ అంబానీ కోస‌మే..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ను ఇండియాలో ప్రసారం చేసేది జియో హాట్ స్టార్ (Jio hotstar). దీని యజమాని ముఖేష్ అంబానీనే ( Ambani). ఈ మధ్యకాలంలో మ్యాచులు జరిగితే జియో హాట్ స్టార్ కు వ్యూయర్షిప్ తగ్గుతోంది. అయితే వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటులో జియో హాట్ స్టార్ కు వ్యూయర్షిప్, ప్రకటనల సంఖ్య పెరిగేందుకుగాను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరిగేలా ఐసీసీ కుట్రలకు తెరలేపినట్లు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ జరిగితేనే జియో హాట్ స్టార్ కు కోట్లలో లాభాలు వస్తాయి. అలాంటిది వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు ఉంటే… ముఖేష్ అంబానీ మరింత ధనవంతుడు కావడం గ్యారెంటీ.

Advertisement

అందుకే బీసీసీఐ, ముఖేష్ అంబానీ అలాగే ఐసీసీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని.. అమిత్ షా కొడుకు జై షా ఈ కుట్రలో పాత్రధారుడు అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒక అంబానీ కోసమే వరల్డ్ కప్ లో కొత్త ఫార్మేట్ తీసుకొచ్చారని.. ఫైర్ అవుతున్నారు. దీనిపై క్రీడా విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. కొత్త ఫార్మాట్ కారణంగా పెద్ద జట్లకు మేలు జరుగుతుందని.. చిన్న జట్లకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

 

Related News

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

Big Stories

Advertisement
×