Inzamam on IPL: 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ {Champions Trophy 2025} కి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ టోర్నీలో అతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో, రెండవ మ్యాచ్ లో భారత్ చేతిలో వరుస ఓటములను చవిచూచింది. దీంతో ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఇక భారత జట్టు మాత్రం వరుస విజయాలతో తన సెమిస్ బెర్త్ ని ఖరారు చేసుకుంది.
Also Read: Saqlain Mushtaq: మగాళ్లైతే పాకిస్థాన్ వచ్చి ఆడండి.. టీమిండియాకు సవాల్ ?
ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాళ్లు, అభిమానులు పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ – హక్ {Inzamam} మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} {Inzamam on IPL} పై తన అక్కస్సును వెళ్ళగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ ఉల్హక్ విషం చిమ్మాడు. ఇండియన్ క్రికెట్ ఫేజ్ ని మార్చేసిన ఓ కంప్లీట్ కమర్షియల్ క్రికెటింగ్ ఫార్మాట్ ఐపీఎల్.
ఇంతకుముందు టీమిండియాలోకి రావాలంటే రంజీ మ్యాచులు, దులీప్ లు, విజయ్ హజారే.. ఇలా చాలా చోట్ల ప్రూవ్ చేసుకుంటే కానీ భారత జట్టులో చోటు దక్కేది కాదు. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఐపీఎల్ లో హిట్ అయ్యారా..? టీమిండియా డోర్ ఓపెన్ అవుతుంది. ఈ ఐపీఎల్ ద్వారా ఇతర దేశ ఆటగాళ్లు కూడా భారీగా అర్జిస్తున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొనేవారు.
కానీ ముంబైలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపిఎల్ లో ఆడకుండా నిషేధించారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఐపీఎల్ {Inzamam on IPL} పై విషం చిమ్ముతూ.. ” ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్స్ అందరూ ఇండియాకి వెళ్లి ఐపిఎల్ ఆడుతున్నారు. అంతేకాకుండా చాలాసార్లు విదేశీ ఆటగాళ్లు జాతీయ మ్యాచ్లకంటే.. ఐపీఎల్ మ్యాచ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read: Rohit Sharma: రోహిత్ మతిమరుపు.. ఈ సారి ఫోన్ మర్చిపోయాడే ?
కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర లీగ్ లలో ఆడడం లేదు. అందుకు వారి క్రికెట్ బోర్డు కూడా అంగీకరించదు. కాబట్టి అన్ని క్రికెట్ బోర్డులు ఇలా చేయండి. మీ మీ జట్ల ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడకుండా నిరోధించండి. మీ ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడేందుకు ఎన్ఓసి జారీ చేయకూడదు. ఈ విషయంలో అన్ని క్రికెట్ బోర్డులు ఒక తాటి పైకి రావాలి” అని అన్నాడు. ఇలా ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రీడాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత 17 సంవత్సరాలుగా ఎంతోమంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా లాభపడుతున్నారని.. అలాంటి ఐపీఎల్ పై ఇలా చిల్లర విమర్శలు తగదని అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు.