Saqlain Mushtaq: ప్రస్తుతం అందరి నోట ఒకే మాట.. పాకిస్తాన్ జట్టు ఎందుకు ఇలా తయారయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగిన ఆ జట్టు.. ఆడిన రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది. ఆతిథ్య హోదాలో కనీసం సెమీస్ వరకైనా వస్తే ఆ జట్టు అభిమానులు సంతోషపడేవారేమో. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దీంతో పాకిస్తాన్ ఇలా ఎందుకు తయారయ్యిందని చర్చ నడుస్తోంది.
Also Read: Rohit Sharma: రోహిత్ మతిమరుపు.. ఈ సారి ఫోన్ మర్చిపోయాడే ?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమితో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా భారత జట్టుపై వారి అక్కస్సును వెళ్లగక్కుతున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఇప్పటికే లీగ్ దశలో రెండు మ్యాచ్లు ఆడిన భారత జట్టు.. రెండింటిలోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ కి వెళ్ళింది. సెమీ ఫైనల్ లోను విజయం సాధిస్తే మార్చ్ 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో ఆడుతుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, మాజీ క్రికెటర్లు భారత జట్టుపై రగిలిపోతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ భారత్ కి సవాల్ విసిరాడు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ” భారత్ నిజంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి పాకిస్తాన్ తో మూడు ఫార్మాట్ లలో 30 మ్యాచ్ లు ఆడాలి. 10 టెస్టులు, 10 వన్డేలు, 10 టి-20 లు ఆడాలి. అప్పుడే ఏది గొప్ప జట్టు అనేది తెలుస్తుంది.
ఇదే జరిగితే భారత జట్టుకు, ప్రపంచ క్రికెట్ కు మేము తగిన సమాదానం చెప్పిన వాళ్ళం అవుతాం” అని సవాల్ విసిరాడు. మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా భారత్ పై తన అక్కసును వెలగక్కాడు. అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు, ఆయా జట్ల ఆటగాళ్లకు భారత్ కి వ్యతిరేకంగా విజ్ఞప్తి చేశాడు. “ప్రపంచంలోని ఆటగాళ్లంతా ఇండియాకి వెళ్లి ఐపీఎల్ ఆడతారు. భారత ఆటగాళ్లు మాత్రం మరే ఇతర లీగ్ లలో ఆడరు.
Also Read: Champions Trophy 2025: టీమిండియా దరిద్రం..వరల్డ్ కప్ 2023 రిపీట్ కాబోతుందా ?
ఈ క్రమంలో అన్ని క్రికెట్ బోర్డులు మీ మీ జట్ల ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడకుండా నిరోధించాలి” అంటూ ఐపిఎల్, బిసిసిఐపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్తాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. కానీ ముంబైలో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్తానీ ఆటగాళ్లను ఐపిఎల్ లో ఆడకుండా నిషేధించారు. ఇలా పాకిస్తాన్ ఆటగాళ్లు భారత జట్టుపై చేస్తున్న విమర్శలు క్రికెట్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మీ జట్టుకు సరిగ్గా ఆడడం చేతకాక.. ఇలా ఇండియా పై పడి ఏడవడం ఏంటని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.