Gaddar Awards: ఇండియాలో తెరకెక్కే మంచి సినిమాలను సత్కరించాలి అనే ఆలోచనతో ఇప్పటికే ఎన్నో అవార్డులు మొదలయ్యాయి. అలాగే కేవలం సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కే మంచి సినిమాలను సత్కరించడానికి కూడా అవార్డులు ఉన్నాయి. కానీ బాలీవుడ్‌లాగా టాలీవుడ్‌కు ప్రత్యేకంగా అవార్డులు లాంటివి ఏమీ లేవు. ఈ విషయంపై తెలుగు సినీ ప్రముఖులు ఎప్పటినుండో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంది అవార్డులు లాంటివి ఉన్నా.. గత కొన్నేళ్లుగా వాటిని అందించడం కూడా ఆపేసింది ప్రభుత్వం. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత నంది అవార్డులు ప్రధానోత్సవం మళ్లీ జరగనుంది. కానీ ఈసారి ఆ అవార్డులకు పేరు మారింది. గద్దర్ అవార్డుల పేరుతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమకు మహర్దశ ప్రారంభం కానుంది.
ప్రోత్సాహం ఉండాలి
ఇప్పటికే గద్దర్ అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. మొత్తానికి ఉగాదికి ఈ అవార్డులను ప్రకటించాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మరోసారి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. అయితే నాటకాలకు కూడా ఈ అవార్డులు ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు నాటకాలకు కూడా అవార్డులు అందించి ఆ విభాగంలో ఉన్న కళాకారులను ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఉగాది నుండే
ఒకప్పుడు నంది అవార్డులు అనేవి తెలుగు సినీ పరిశ్రమకు ఉన్నతమైన అవార్డులుగా ఉండేవి. కానీ గత పదేళ్లుగా ఈ అవార్డుల ఫంక్షన్ జరగడం ఆగిపోయింది. అందుకే ఈ అవార్డుల ఫంక్షన్‌ను తిరిగి ప్రారంభించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు సినీ ప్రముఖులు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత గద్దర్ అవార్డుల (Gaddar Awards) పేరుతో మళ్లీ ఈ అవార్డ్ వేడుకలు ప్రారంభం కావడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గద్దర్ జయంతి నుండి ఈ అవార్డ్ వేడుకలు ప్రారంభం కావాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంది. కానీ ఇటీవల ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇవి ఉగాది నుండే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
Also Read: పాపం బన్నీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీమ్స్‌తో ట్రోల్స్.?
ప్రజాగాయకుడి పేరు మీద
ప్రజాగాయకుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు గద్దర్ (Gaddar). ఇప్పటికీ ఆయన పాడిన పాటలను ఇష్టంగా వింటుంటారు ప్రేక్షకులు. తెలంగాణ యాసలో, తెలంగాణ ప్రజల గురించి ఆయన పాడిన పాటలు ప్రేక్షకులను కదిలించేవి. ఆయన లేకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ ప్రజలకు గుర్తుగా ఉండిపోతాయని ఆయన అభిమానులు అంటుంటారు. అందుకే నంది అవార్డులను పేరు మార్చి గద్దర్ అవార్డులకు సినీ ప్రముఖులకు ఇస్తామని ప్రకటించినప్పుడు ఆయన అభిమానులు సైతం సంతోషించారు. గద్దర్ సినీ అవార్డుల్లో మూడు కేటగిరిలు ఉండనున్నాయి. ఫీచర్ ఫిల్మ్స్, చిల్డ్రన్ ఫిల్మ్స్, బుక్స్ ఆన్ తెలుగు సినిమా. సాహిత్యానికే తమ జీవితాన్ని అంకితం చేసి, ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తున్న వారికి కూడా ఈ అవార్డులు దక్కనున్నాయి.