BigTV English

ipl 2024 : ఐపీఎల్ ఆటగాళ్ల కోసం.. ఏ ఫ్రాంచైజీ పర్స్ లో ఎంత ఉంది?

ipl 2024 : ఐపీఎల్ ఆటగాళ్ల కోసం.. ఏ ఫ్రాంచైజీ పర్స్ లో ఎంత ఉంది?
IPL 2024

ipl 2024 : ఐపీఎల్ 2024 సీజన్ కోసం అప్పుడే హంగామా మొదలైంది. పాత సీజన్ లో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తారని అనుకున్నవాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినవాళ్లు సంచలనాలు సృష్టించారు. ఇవేమీ లేకుండా సాదాసీదాగా ఆడిన కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఎవరి పర్స్ లో ఎంత డబ్బు మిగిలి ఉందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


ఉన్న డబ్బుతో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంతవరకు నిలబడవచ్చు…అసలు సంసారాన్ని నడిపించగలమా? లేదా? అని ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. డబ్బుల్లేని వాళ్లు ఎప్పటిలాగే తమ పరిస్థితి ఇంతేననుకొని ఉన్నవాళ్లతో సరిపెట్టుకుంటారా? లేక కొత్తవారి కోసం ప్రయత్నిస్తారా? అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.

 ఐపీఎల్ 2024 సీజన్ కోసం వచ్చే నెల 19న, మినీ వేలం నిర్వహించనున్నారు. ఇంతవరకు జరిగిన ట్రేడిండ్ లో హార్దిక్ పాండ్యా, కామెరూన్ గ్రీన్ ఇద్దరూ ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు.


హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కి ఇచ్చేసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు ఉన్నాయి.


కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద రూ.32.07కోట్లు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.01 కోట్లు ఉన్నాయి
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.31.04 కోట్లు ఉన్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.34 కోట్లు ఉన్నాయి.

ఆర్సీబీ వద్ద రూ.23.25 కోట్లు ఉన్నాయి. కాకపోతే ముంబై ఇండియన్స్ గత వేలంలో రూ.17.05 కోట్లు వెచ్చించి కొన్న ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ని ఆర్సీబీకి ఇచ్చేసింది. ఇది అత్యంత ఖరీదైన ట్రేడింగ్ గా నిలిచింది. ఎందుకంటే తమకి మరో ఆల్ రౌండర్ హార్దిక్ మళ్లీ వచ్చాడు కాబట్టి, ఇద్దరు అవసరం లేదనే భావనతో తనని వదిలేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్లు,  
లఖ్ నవ్ సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు , రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.14.05 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్లు ఉన్నాయి.

మరి ఉన్న ఈ మొత్తాలతో ఫ్రాంచైజీలు వచ్చేనెల డిసెంబర్ 19న వేలంలో, ఏ అద్భుతాలు చేసే ఆటగాళ్లను సొంతం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×