Big Stories

Subhiksha Fraud | ఐఐటి ఐఐఎంలో చదువుకున్నాడు.. కట్ చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష

Share this post with your friends

Subhiksha Fraud | దేశంలో ఎంతో మంది ప్రతిష్ఠాత్మక ఐఐటి, ఐఐఎం లాంటి విద్యా సంస్థల్లో చదువుకొని ఉన్నత పదవులు చేపడుతుంటే.. ఆ వ్యక్తి మాత్రం బినామీ కంపెనీలు పెట్టి కోట్లు దోచుకున్నాడు. ఆ తరువాత అతని బండారం బయటపడడంతో కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

తమిళనాడుకి చెందిన ఆర్ సుబ్రమణియన్ ఐఐటి, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థల నుంచి డిగ్రీ పొందాడు. ఆ తరువాత 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో సంస్థను స్థాపించి కొత్త కొత్త స్కీముల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు తీసుకున్నాడు. అలా ఆ పెట్టుబడులను సంవత్సారల వరకు బినామీ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లిస్తూ షేర్ మార్కెట్లో తన కంపెనీ షేర్ విలువ పెంచుకున్నాడు.

షేర్ల విలువ పెరిగిందని.. వచ్చిన లాభాలను మళ్లీ వేరే స్కీములలో పెడుతున్నామని విశ్వప్రియ కంపెనీ పెట్టుబడుదారులకు చెప్పేది. ఆ తరువాత 1997లో సుభిక్ష సూపర్ మార్కెట్ రిటైల్ చైన్ స్థాపించాడు. ఇన్నేళ్లుగా ప్రజల వద్ద అధిక లాభాల ఆశలు చూపిస్తూ వందల కోట్లు తీసుకున్నాడు.

కానీ కొంతకాలంగా సుబ్రమణియన్ ప్రజలకు కంపెనీ షేర్ల నుంచి లాభాలు రావడం లేదు. పోనీ తమ పెట్టుబడులు ఉపసంహరించుకుందామంటే డబ్బులు లేవని తేలింది. దీంతో సుబ్రమణియన్, ఆయన కంపెనీ భాగస్వాములపై ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి.

ఆ కేసుల విచారణ చేసిన చెన్నై స్పెషల్ కోర్టు నవంబర్ 20, 2023న సుబ్రమణియన్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News