Big Stories

Rohit Sharma Vs Hardik Pandya: పాండ్యా.. అంతొద్దు.. రోహిత్ ఫ్యాన్స్ ఫైర్..!

Hardik Pandya

- Advertisement -

Rohit Sharma Vs Hardik Pandya: ఎట్టకేలకు వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ముంబై ఇండియన్స్ జట్టులోకి రోహిత్ శర్మ వెళ్లాడు. అంతేకాదు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తొలిసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్న రోహిత్ శర్మకు సరైన విలువ, గౌరవం దక్కలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ బౌలింగ్ ప్రారంభించింది.

- Advertisement -

జనరల్ గా సీనియర్ ఆటగాళ్లు ఎవరున్నా సరే వారిని లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ కి పంపించరు. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ అంతా పరుగెత్తాల్సి ఉంటుంది. అంతే కాదు.. కఠినమైన క్యాచ్ లు అందుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా లాంగ్ ఆన్ లో యువకులను పెట్టి సీనియర్స్ ని దగ్గరలో పెడుతుంటారు. లేదా స్లిప్స్, లేదా థర్డ్ మేన్ ఇలా ఉంచుతారు. అది వారికిచ్చే గౌరవంగా భావిస్తారు.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చాలా నిర్లక్ష్యంగా కనిపించాడు. అంతే కాదు రోహిత్ శర్మని ఫీల్డింగ్ పొజిషన్స్ మార్చుతూ చాలా  ఇబ్బంది పెట్టాడు. సాధార‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్   ఈ మ్యాచ్‌లో మాత్రం బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌నిపించాడు. ఇక ఆఖరి ఓవర్ లో అయితే.. ఓ సాధారణ ఆటగాడిలా  రోహిత్ ను ట్రీట్ చేశాడు.

Also Read: గెలుపు ముంగిట ముంబై బోల్తా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ విజయం..

ఇవన్నీ చూసినా  రోహిత్ ఫ్యాన్స్, హార్దిక్ అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆటగాళ్లపై అభిమానం ఉండాలి కానీ ఇతరులను గాయపరిచేలా ఉండకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌల‌ర్‌తో మాట్లాడిన హార్దిక్ వెంట‌నే రోహిత్‌ను మ‌ళ్లీ లాంగ్ఆ న్ పొజిషన్‌కు వెళ్లమని సూచించాడు. హార్దిక్ నిర్ణయంతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగ్ ఆన్‌కు వెళ్లాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వెక్కువ ఎక్స్ ట్రాలు చేయకుండా మ్యాచ్ ఆడమని సూచిస్తున్నారు. రేపు టీమ్ ఇండియాకి తనే కెప్టెన్, ఆ సంగతి గుర్తు పెట్టుకోమని వార్నింగ్ లు ఇస్తున్నారు.  హార్దిక్ పాండ్యా కావాలనే ఇదంతా చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా మున్ముందు ఇలాంటివెన్ని చూడాల్సి వస్తుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News