BigTV English

GT vs MI: గెలుపు ముంగిట ముంబై బోల్తా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ విజయం..

GT vs MI: గెలుపు ముంగిట ముంబై బోల్తా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ విజయం..
Gujarat Titans won by six runs against Mumbai Indians
Gujarat Titans won by six runs against Mumbai Indians

Gujarat Titans vs Mumbai Indians (ipl match today): అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాాన్స్‌తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపు ముంగిట బోల్తా పడింది. 169 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో చతికిలపడింది. ఆరు పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. రోహిత్(43), బ్రెవిస్(46) రాణించినా ముంబై ఓటమి చవిచూసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది.


169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన నమన్ ధీర్ 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో కేవలం 10 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి రెండు వికెట్లు ఆఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా తీశాడు.

మరో వైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ ముంబైని లక్ష్యం వైపు నడిపించారు. ఈ తరుణంలో 29 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ సాయి కిశోర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 107 పరుగుల వద్ద ముంబై 3వ వికెట్ కోల్పోయింది.


ఈ దశలో బ్రెవిస్, హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. 38 బంతుల్లో 47 పరుగులు చేసిన బ్రెవిస్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మతో జత కట్టిన టిమ్ డేవిడ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

12 బంతుల్లో 27 పరుగులు అవసరం కాగా తిలకవర్మ 19వ ఓవర్ మొదటి బంతికి సిక్స్ కొట్టి రెండో బంతికి అవుట్ అయ్యాడు. చివరి బంతికి స్పెన్సర్ కోయెట్జీ వికెట్ తీసి ముంబైను దెబ్బ కొట్టాడు. దీంతో ముంబై విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు కావాలి.

ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి హార్థిక్ సిక్స్ కొట్టాడు. 5 బంతుల్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రెండో బంతిని ఫోర్ కొట్టాడు. చివరి 4 బంతులకు 9 పరుగులు కావాల్సి ఉండగా మూడో బంతికి హార్ధిక్ అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చావ్లా డకౌట్ అయ్యాడు. ఐదో బంతికి సింగిల్ రాగా, చివరి బంతికి ఒక్క పరుగు రావడంతో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్(45), తెవాటియా(22) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

Also Read: RR vs LSG: పూరన్ పోరాటం వృథా.. రాజస్థాన్ రాయల్స్ విజయం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్ శుభమన్ గిల్ తొలి బంతికే ఫోర్ కొట్టి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఓపెనర్లు గిల్, సాహా 4 ఓవర్లలో 31 పరుగులు చేశారు. 19 పరుగులు చేసిన సాహాను బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. రెండో వికెట్‌కు గిల్, సాయి సుదర్శన్ 33 పరుగులు జోడించారు. 31 పరుగులు చేసిన గిల్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అజ్మతుల్లా.. సాయి సుదర్శన్‌తో కలసి ఇన్నింగ్స్ చక్కబట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో 17 పరుగులు చేసిన అజ్మతుల్లా కోయెట్జీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 12 పరుగులు చేసిన మిల్లర్ 4 వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 45 పరుగులు చేసిన సాయి సుదర్శన్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 134 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయిన తరుణంలో రాహుల్ తెవాటియా చివర్లో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది.

4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×