BigTV English

IPL 2024 LSG vs DC: మా ఓటమికి ముగ్గురు కారణం: కేఎల్ రాహుల్

IPL 2024 LSG vs DC: మా ఓటమికి ముగ్గురు కారణం: కేఎల్ రాహుల్

KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాతూ మా ఓటమికి ముగ్గురు కారణమని తెలిపాడు. కుల్‌దీప్ యాదవ్ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడని అన్నాడు. అరంగేట్ర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ కూడా తమ ఓటమికి కారణమయ్యాడని తెలిపాడు. వీరిద్దరితో పాటు రిషబ్ పంత్ కూడా చక్కగా కుదురుకుని గట్టిగా ఆడాడు. వీరే ప్రధాన కారణమని అన్నాడు.


ఇంకా మాట్లాడుతూ.. ఓపెనింగ్ బాగానే ఉంది. మంచి పునాది పడింది. 180 పరుగులు పైనే సాధిస్తామని అనుకున్నాం. కానీ 167 దగ్గర ఆగిపోయాం.మరో 20 పరుగులు సాధించి ఉంటే బాగుండేదని అన్నాడు. అయితే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించింది. అంతేగాక బాల్ కొన్నిసార్లు తక్కువ ఎత్తులో రావడంతో, కుల్‌దీప్ యాదవ్ దాన్ని గొప్పగా ఉపయోగించుకుని వికెట్లు సాధించాడని అన్నాడు. అలాగే కొత్త కుర్రాడు జేక్ ఫ్రేజర్ భారీ షాట్లతో గొప్పగా ఆడాడు. క్రెడిట్ అతనికే దక్కాలని అన్నాడు.

అందరూ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాం. అందుకు తగిన ప్రణాళికలతోనే వచ్చాం.
సరైన ప్రదేశాల్లోనే బౌలింగ్ చేయాలని భావించాం. బ్యాటర్ల వీక్ నెస్ స్టడీ చేశాం. ఆ ప్రకారమే పవర్‌ప్లేలో వార్నర్‌ను ఔట్ చేశామని అన్నాడు. తర్వాత కూడా వికెట్ సాధించాం. కానీ జేక్ ఫ్రేజర్, పంత్ కుదురుకుని మ్యాచ్‌ను దూరం చేశారని అన్నాడు.


బ్యాటింగ్ చేసేటప్పుడు పూరన్‌ను పంపించి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నాం. తను క్రీజులో సెట్ అయితే ప్రమాదకరంగా మారతాడు. కానీ కుల్‌దీప్ తనని క్లీన్‌బౌల్డ్ చేశాడు అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
Also Read: అంపైర్ తో పంత్ గొడవ కరెక్టేనా?

గెలుపుపై పంత్ మాట్లాడుతూ ముందుగానే లక్నోను తక్కువ స్కోరుకి కట్టడి చేయాలని అనుకున్నాం. అన్నీ అనుకున్నట్టు జరిగాయి. తర్వాత లో స్కోరు మ్యాచ్ కావడంతో ఒత్తిడి లేకుండా, షాట్లకు పోకుండా మ్యాచ్ ఫినిష్ చేయాలని భావించాం. అలాగే చేశామని అన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరగడంతో విజయం సాధించామని అన్నాడు.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×