BigTV English

Rishabh Pant: అంపైర్ తో పంత్ గొడవ కరెక్టేనా?

Rishabh Pant: అంపైర్ తో పంత్ గొడవ కరెక్టేనా?

Rishabh Pant Argues With UImpire Over Review Call against LSG: ఐపీఎల్ లో ఎన్నో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మ్యాచ్ ల్లో స్లో రన్ రేట్ కారణంగా కెప్టెన్లు పెనాల్టీలు కడుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ కి సంబంధించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహారం పెద్ద తలపోటుగా ఉంది. మరోవైపు ఫ్యాన్స్ ఒక ఆటాడుకుంటున్నారు.


ఇవన్నీ ఇలా జరుగుతుండగా తాజాగా లఖ్ నవ్ తో జరిగిన మ్యాచ్ లో  ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఏకంగా అంపైర్ తోనే గొడవ ఏసుకున్నాడు. ఇదిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. లఖ్ నవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్  తీసుకుంది. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ నాలుగో ఓవర్ వేయగా.. అతడు వేసిన నాలుగో బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అది వైడ్ కాదని భావించిన రిషభ్ పంత్.. రివ్యుకి అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ డీఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్ అని తేలింది.  దీంతో పంత్ మళ్లీ అసహనానికి గురయ్యాడు.


ఎందుకంటే ఉండేవే రెండు రివ్యూలు. అందులో ఒకటి ఒక వైడ్ బాల్ కోసం పోయింది. అదే వికెట్ కోసమైతే బ్యాటర్ కి మేలు జరిగేదని తన భావం. దీంతో నేనసలు డీఆర్ఎస్ అడగలేదని మళ్లీ ఫీల్డ్ అంపైర్ తో వాదనేసుకున్నాడు. ఇది ముదిరిపోయింది.

Also Read: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్

తను అడిగాడా? లేదా? అనేది పక్కన పెడితే, ఒకవేళ అంపైర్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల డీఆర్ఎస్ కి వెళితే వెళ్లి ఉండవచ్చు. అది వైడ్ అని తేలింది. అక్కడితో పంత్ ఆగిపోవాల్సింది. తాను అసలు రివ్యూనే అడగలేదని మరోసారి ఫీల్డ్-అంపైర్‌తో ఏసుకున్నాడు.ఈ రచ్చ నాలుగు నిమిషాల పాటు సాగింది. ఈ క్రమంలో మళ్లీ రీప్లే చేశారు.. పంత్ రివ్యూ అడిగినట్లు అందులో తేలింది. దీంతో తను సైలంట్ అయిపోయాడు.

ఇంత రచ్చ అవసరమా? అని నెటిజన్లు పంత్ ని ప్రశ్నిస్తున్నారు. అంపైర్లను మనం గౌరవించాలి. అది బాధ్యత. అది పార్ట్ ఆఫ్ క్రికెట్ అని అంటున్నారు. అంపైర్ తప్పు చెప్పినా, తలదించుకు రావాలి. అప్పుడే జడ్జిమెంట్ కరెక్టుగా ఉంటుంది. అందుకే రివ్యూలు కూడా పెట్టారు. ఇక్కడ కూడా గొడవైతే ఎలాగ? పంత్? అని అంటున్నారు.

మొత్తానికి ఈ వ్యవహారం నెట్టింట వైరల్ కావడంతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తీవ్రంగా స్పందించాడు. పంత్ తీరు సరైంది కాదని, అతనికి జరిమానా విధించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×