Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ జీవితంలో సక్సెస్ ఎంత ఉందో.. వివాదాలు అంతకుమించి ఉన్నాయి. ముఖ్యంగా ధనుష్ తన సొంత కొడుకు అని ఇద్దరు భార్యాభర్తలు కోర్టుకెక్కడం అనేది ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో జరగలేదు. 2015 లో కోలీవుడ్ డైరెక్టర్ కస్తూరి రాజా చిన్న కొడుకుగా పెరుగుతున్న ధనుష్.. తమ సొంతకొడుకు అని మధురైకు చెందిన కతిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టులో కేసు వేశారు. అయితే వారు తన తల్లిదండ్రులు కాదని ధనుష్ కూడా అంతే పోరాడాడు.
చిన్నతనంలో నటనపై ఉన్న ఆసక్తితో ధనుష్ పారిపోయి వచ్చాడని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆ దంపతులు కోర్టు చుట్టూ తిరుగుతూనే వచ్చారు. తాము ఈ వయస్సులో కష్టపడేలకపోతున్నామని, తమకు జీవనభృతిగా ధనుష్ ప్రతి నెల కొంత డబ్బు పంపాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 9 ఏళ్లు వీరు పోరాటం చేయగా.. నెల క్రితమే కోర్టు ఈ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేని కారణంగా ధనుష్.. కస్తూరి రాజా కొడుకు అని తేల్చి చెప్పింది.
ఇక ఈ నేపథ్యంలోనే ధనుష్ ఒరిజినల్ తండ్రి అని చెప్పుకుంటున్న కతిరేశన్ మృతిచెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధురై ప్రభుత్వాసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కతిరేశన్ మృతిపట్ల ధనుష్ స్పందిస్తాడా.. ? లేదా.. ? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.