CUET PG 2024 Results: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 4.6 లక్షల మంది అభ్యర్థులు CUET PG ఎంట్రన్స్ పరీక్ష రాశారు. అభ్యర్థులు తమ ఫలితాలను pgcuet.samarth.ac.in అఫీషియల్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి 11 నుంచి 28 వరకూ మూడు షిఫ్టుల్లో CUET PG ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 10.45 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకూ, మూడో షిఫ్ట్ పరీక్షలు సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 వరకూ 572 సెంటర్లలో సీబీటీ మోడ్ లో జరిగాయి. CUET PG 2024 ఫైనల్ ఆన్సర్ కీ ను NTA ఏప్రిల్ 12న విడుదల చేసింది.
కాగా.. ఈ పరీక్షల్లో NTA మొత్తం 92 ప్రశ్నలను తీసివేసింది. ఆ ప్రశ్నలన్నింటికీ అభ్యర్థులు ఫుల్ మార్క్స్ పొందుతారని తెలిపింది. CUET PG 2024 రిజల్ట్స్ లో అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులైనా పొంది ఉండాలి. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తామని NTA తెలిపింది.