BigTV English

Sarfaraz Khan in IPL 2024: సర్ఫరాజ్ లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ కి వస్తున్నాడు..?

Sarfaraz Khan in IPL 2024: సర్ఫరాజ్ లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ కి వస్తున్నాడు..?

Lucky chance for Sarfaraz Khan.. Re-entry in IPL!?


Lucky chance for Sarfaraz Khan Re-entry in IPL: ఇంగ్లాండ్ సిరీస్ లో ధనాధన్ ఆటతో అందరినీ మైమరపించిన సర్ఫరాజ్ ఖాన్ కి అనుకోని అదృష్టం ఎదురైంది. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీకి ఆడిన సర్ఫరాజ్ ను ఆ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అయితే రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ ని ఎవరూ కొనుగోలు చేయలేదు.

కానీ ఇప్పుడు ప్రపంచానికి సర్ఫరాజ్ అంటే ఏమిటో తెలుసు. దీంతో గుజరాత్ టైటాన్స్ కి ఒక అవకాశం లభించింది. అదేమిటంటే ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన భారత యువ కీపర్ రాబిన్ మింజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. దీంతో తను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.


ఇప్పుడతని స్థానాన్ని సర్ఫరాజ్ తో భర్తీ చేయాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. అందుకు తగిన చర్చలు గుజరాత్ మేనేజ్మెంట్ చేసినట్టు, అతను త్వరలోనే జట్టులోకి చేరతాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది. సర్ఫరాజ్ ఖాన్ తీసుకోవడం వెనుక శుభ్ మన్ గిల్ హస్తం ఉందని అంటున్నారు. ఎందుకంటే తను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కావడం, ఇంగ్లాండ్ సిరీస్ లో జట్టుతో ఉండటం, సర్ఫరాజ్ కి ఇలా కలిసి వచ్చిందని అంటున్నారు.

Also Read: ఇది సమష్టి విజయం.. అందుకే ఓడిపోయాం.. కెప్టెన్స్ కామెంట్స్..!

ధర్మశాలలో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో బెన్ డకెట్ తో గిల్ గొడవ పడినప్పుడు సర్ఫరాజ్ చాలా దూకుడుగా వచ్చి గిల్ కి సపోర్ట్ గా నిలిచాడు. బహుశా ఇది గిల్ కి నచ్చిందేమోనని కొందరంటున్నారు. ఏదేమైనా సర్ఫరాజ్ కి మేలు జరిగింది. అతని ఆర్థిక పరిస్థితి ఇక బాగుంటుందని నెటిజన్లు కామెంటు చేస్తున్నారు.

ఇంతకుముందు సర్ఫరాజ్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా ఆడాడు. కానీ ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఐపీఎల్ లో సర్ఫరాజ్ ప్రదర్శన అంత పవర్ ఫుల్ గా లేదు. 50మ్యాచ్ లు ఆడి కేవలం 585 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. మరో నాలుగురోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి
అందరికీ తెలిసిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×