Big Stories

RR vs LSG: నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్.. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్, లక్నో ఢీ..

Rajasthan Royals vs Lucknow Super Giants Match Preview
Rajasthan Royals vs Lucknow Super Giants Match Preview

Rajasthan Royals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024లో మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఒకొక్కరు కొదమ సింహాల్లా పోరాడుతున్నారు. నేడు డబుల్ హెడర్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ -లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరగనుంది.

- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అయితే, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉన్నాడు.

- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ కి రెండు షాక్ లు తగిలాయి. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఆడటం లేదు. గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడు. ఇదే పరిస్థితి లక్నోకి కూడా తగిలింది. అదేమిటంటే కెప్టెన్ రాహుల్ ను స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడమని బీసీసీఐ కోరింది. అంటే కీపింగ్ చేయవద్దని తెలిపింది. ఇప్పుడు లక్నోలో కీపర్ కమ్ బ్యాటర్ కావాలి. అప్పుడు కాంబినేషన్స్ మారిపోతాయి.

సంజు శాంసన్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి ట్రోఫీ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2022లో మిస్ అయ్యింది. ఈసారి పట్టు సడలించకూడదని భావిస్తున్నాడు.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్ లు గెలవగా, లక్నో ఒక మ్యాచ్ గెలిచింది. ఈ గ్రౌండ్ లో 52 మ్యాచ్ లు ఆడిన రాజస్తాన్ 33 మ్యాచ్ ల్లో గెలుపొందింది. లక్నో మాత్రం ఒకటే మ్యాచ్ ఆడింది. అందులో విజయం సాధించింది.

Also Read: క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా.. పోరాడి ఓడిన హైదరాబాద్..

ఈ మైదానంలో అత్య‌ధిక స్కోరు 154 ప‌రుగులు కాగా, అత్య‌ల్ప స్కోరు 144 ప‌రుగులుగా ఉంది. రెండు జట్లు కూడా సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అలాగే రెండు జట్ల మధ్య కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి.

ఒకరి బౌలింగ్ లోనే ఎక్కువగా అవుట్ అయ్యే బ్యాటర్లు ఇటువైపు ఉన్నారు. అటువైపు ఉన్నారు. ఉదాహరణకి కేఎల్ రాహుల్ ని అవుట్ చేయడమంటే అశ్విన్ కి సరదా…తన బౌలింగ్ లో ఎక్కువసార్లు అవుట్ అవుతూ ఉంటాడు. అలాంటి కాంబినేషన్స్ రెండు వైపులా ఉన్నాయి. నేటి మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News