Big Stories

RCB Playoff Chances: ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా ఉన్నట్టేనా?

IPL 2024 RCB Playoff Chances: సాధారణంగా ఇలాంటి పరిస్థితి మన టీమ్ ఇండియాకి ఎక్కువగా వస్తుంటుంది. మనవాళ్లు ముందుగా అన్నింటా ఓడిపోయి, చివర్లో నిద్రలేచి అప్పుడు ఆడుతుంటారు. ఆ సమయానికి పరిస్థితులు పీకలమీదకు వస్తుంది. అది ఓడిపోయి, ఇది గెలవాలి, ఇది ఓడిపోయి అది గెలవాలి. దాని రన్ రేట్ పెరగకూడదు, దీనికి తక్కువ ఉండాలి. ఇలాంటి పజిల్స్, మెదడుకు మేత ప్రజలకు బాగా పెడుతుంటారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఆర్సీబీ కూడా చేరింది.

- Advertisement -

ఎట్టకేలకు 6 మ్యాచ్ ల తర్వాత ఒక మ్యాచ్ గెలిచినా ఆర్సీబీకి, ఈ గెలుపు అంత బూస్ట్ ఇవ్వలేదు. నిజానికి ఇప్పటికైనా పదో ప్లేస్ నుంచి 9కి చేరుతుందేమో అనుకుంటే, దారుణమైన రన్ రేట్ కారణంగా అక్కడే చతికిలపడిపోయి, లేవలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్లే ఆఫ్ అవకాశాలు మిణుకు మిణుకు మంటూ ఉండటం నిజంగా అద్భుతమేనని చెప్పాలి.

- Advertisement -

ఇలా ఎందుకు జరిగిందంటే అందుకు ముఖ్య కారణం ఏమిటంటే, టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ని పక్కన పెడితే, కోల్ కతా, హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో మూడు కూడా కేవలం 5 మ్యాచ్ లు మాత్రమే గెలిచి 10 పాయింట్లతో 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీబీ ఇంకా 5 మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇప్పుడు వీటన్నింటిలో వరుసగా గెలిస్తే 14 పాయింట్లు వస్తాయి.

2024 సీజన్ లో ఆడుతున్న జట్ల ఆటతీరు చూస్తుంటే, ఏదో రొడ్డ కొట్టుడు తప్ప మరొకటి కనిపించడం లేదు. అందువల్ల ఒకటి గెలిస్తే, ఒకటి ఓడిపోతున్నారు. ఆర్సీబీ 14 పాయింట్లు సాధిస్తే, మిగిలినవి 12 పాయింట్ల వద్ద ఆగే అవకాశాలున్నాయి. కోల్ కతా ఇంకా మూడు మ్యాచ్ లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఆల్రడీ రెండు ఓడిపోయి ఉంది. హైదరాబాద్, లక్నో మూడేసి చొప్పున ఓడిపోయాయి. చెన్నయ్ 4 ఓడిపోయింది. ఆర్సీబీ 7 ఓడిపోయింది. ఇవన్నీ ఒకట్రెండు అటూ ఇటుగా ఓడిపోవాల్సి ఉంది.

Also Read: సన్‌రైజర్స్‌కు బ్రేక్.. ఆర్సీబీ గెలిచిందోచ్‌..

అయితే ఇప్పుడు ఆర్సీబీ రాబోవు రోజుల్లో గుజరాత్ తో రెండుసార్లు, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ , పంజాబ్ ను ఓడించడం సులువుగానే ఉంది. ఎటొచ్చి ఢిల్లీ, చెన్నయ్ తో కొద్దిగా మనసుపెట్టి ఆడితే ప్లే ఆఫ్ కి సులువుగా చేరుకోవచ్చునని సీనియర్లు లెక్కలు వేసి చెబుతున్నారు. మరెంతవరకు మన టీమ్ ఇండియా లెక్కలు నిజం అవుతాయో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News