Big Stories

Kodali Nani: ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్న కొడాలి నాని..?

Kodali Nani: గుడివాడ అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశాయి. అయితే ఆయన దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ టీడీపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. నామినేషన్ ప్రతాల్లో తప్పుడు సమాచారం పొందుపరిచారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం నెలకొంది. ఇటీవలే ఆయన 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రకటించారు. కానీ ఈ ఎన్నికల్లో గుడివాడ స్థానం నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే నాని దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఉందని.. ఆయన నామినేషన్ తిరస్కరించాలంటూ టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

మున్సిపల్ కార్యాలయాన్ని నాని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారంటూ టీడీపీ ఆర్వోకి ఫిర్యాదు చేసింది. భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించిన పత్రాలను కూడా టీడీపీ ఆ ఫిర్యాదుతో జత చేసింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కొడాలి నాని నామినేషన్ తిరస్కరించాలంటూ టీడీపీ రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేసింది.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

కొడాలి నాని సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోలేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై టీడీపీ ఫిర్యాదు చేయగా.. రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొడాలి నాని అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు తప్పు అని నిర్థారిస్తే.. ఆయన ఎన్నికల బరినుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేయడానికి గురువారమే గడువు ముగిసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News