BigTV English

Discount Offer On SUV: మరో 4 రోజులు మాత్రమే.. ఈ SUVపై రూ. 3.40 లక్షల విలువైన ఆఫర్‌లు..!

Discount Offer On SUV: మరో 4 రోజులు మాత్రమే.. ఈ SUVపై రూ. 3.40 లక్షల విలువైన ఆఫర్‌లు..!

Discount Offer On SUV: కార్లకు మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్‌ ఉంది. అందువల్ల మార్కెట్‌లోకి కొత్త కారు లాంచ్ అవుతుందంటే కస్టమర్లు కొనేందుకు ఎగబడుతుంటారు. అయితే మంచి తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు గుడ్ న్యూస్. ఓ ఎస్యూవీ కారుపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


వోక్స్‌వ్యాగన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో టిగెవాన్‌ (Tiguan) అత్యంత ఖరీదైన SUV కార్. ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ SUVపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ టిగువాన్‌పై రూ.3.4 లక్షల వరకు ప్రయోజనాలు అందించబడుతున్నాయి.

అందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ప్రయోజనాలు, SVP ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ చెల్లుబాటు పొడిగించబడుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.


Also Read: ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!

Tiguan కొనుగోలుపై కస్టమర్లు ఏకంగా రూ.75,000 వరకు నేరుగా నగదు తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా భారీగానే ఉంది. వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్ వద్ద మీ పాత కారుని ఎక్స్ఛేంజ్ చేయడం. దీని ద్వారా గరిష్టంగా రూ. 75,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

అంతేకాకుండా మీరు కార్పొరేట్‌లో పని చేస్తున్నట్లయితే.. Tiguan కొనుగోలుపై కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు రూ.1లక్ష వరకు ఉంటుంది. అయితే దీని కోసం మీ కంపెనీ ఈ ఆఫర్ పరిధిలో ఉందో లేదో డీలర్‌షిప్ నుండి తెలుసుకోవాల్సి ఉంటుంది.

దీంతో పాటు మరొక భారీ ఆఫర్ ఉంది. Tiguan కొనుగోలుపై 4 సంవత్సరాల Service Value Package (SVP) కూడా అందించబడుతోంది. దీని ధర రూ. 90,000 వరకు ఉంటుంది. ఈ ప్యాకేజీలో రెగ్యులర్ సర్వీసింగ్, మెయింటెనెన్స్, పార్ట్స్ రీప్లేస్‌మెంట్ వంటి ఉండవచ్చు. అయితే దీని గురించి పూర్తి సమాచారం కోసం డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

ఈ విధంగా ఈ ప్రయోజనాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా.. Tiguanపై కస్టమర్లు మొత్తం రూ.3.4 లక్షల వరకు ఆఫర్ ప్రయోజనాలు పొందుతారు. ఇక ఈ టిగువాన్ ధర విషయానికొస్తే.. దీని ధర రూ. 35.17 లక్షలుగా ఉంది. ఇది 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (190 PS/320 Nm)తో వస్తుంది. ఇది 13.54kmpl మైలేజీని ఇవ్వగలదు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×