BigTV English

RR Vs PBKS Match Preview: రాజస్థాన్ గెలుస్తుందా? నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్

RR Vs PBKS Match Preview: రాజస్థాన్ గెలుస్తుందా? నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్

IPL 2024 65th Match-Rajasthan Royals Vs Punjab Kings Preview: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నప్పటికి, ఖచ్చితమైన గెలుపుతో వెళ్లాలని రాజస్థాన్ భావిస్తోంది. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పుడందరిలో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే వరుసగా మూడు మ్యాచ్ ల నుంచి ఓడిపోతూ వస్తోంది.


మరోవైపు పంజాబ్ కింగ్స్ చివర్లో రెచ్చిపోతోంది. అసలే అట్టడుగుకి పోయి హీట్ మీదున్న పంజాబ్ గట్టిగా తగులుకుంటే రాజస్థాన్ కి ఇబ్బందే అంటున్నారు. నేడు ఈ రెండు జట్ల మధ్య గౌహతిలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

పంజాబ్ కింగ్స్ 8 పాయింట్స్ తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. కనీసం అవైనా గెలిచి అట్టడుగు స్థానం నుంచి బయటకు వచ్చి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.


Also Read: SRH vs GT Match Today : గుజరాత్ కి చెలగాటం… హైదరాబాద్ కి ప్రాణ సంకటం

ఇకపోతే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 27 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 16 సార్లు గెలిచింది. పంజాబ్ 11 సార్లు విజయం సాధించింది.

పంజాబ్ కింగ్స్ లో చిచ్చర పిడుగుల్లాంటి ఆటగాళ్లున్నారు. ప్రభుసిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, శశాంక్ సింగ్ లాంటి వాళ్లున్నారు. బౌలింగులో అర్షదీప్, శామ్ కర్రాన్, రబడ, హర్షల్ పటేల్ తదితరులున్నారు. అందరూ కలిస్తే రాజస్థాన్ కి కష్టాలు తప్పవని అంటున్నారు.

Also Read: ఢిల్లీ గెలుపు.. పీకల మీదకు తెచ్చుకున్న లక్నో..

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, జట్టు లో కీలక ఆటగాడు బట్లర్ స్వదేశం ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. తను టీ 20 ప్రపంచకప్ జట్టులో ఉన్నాడు. దాంతో ఆ జట్లు రమ్మని చెప్పడంతో విమానం ఎక్కేశాడు. ఇది జట్టుకి పెద్ద దెబ్బగా ఉంది. అలాగే యశస్వి జైశ్వాల్ ఉన్నాడు కానీ రెగ్యులర్ గా ఆడటం లేదు. ఏదో ఒక సెంచరీ చేశాడంతే. ఇక సంజు శాంసన్ పైనే భారమంతా పడుతోంది. రియాన్ పరాగ్ ఏమైనా క్లిక్ అయితే మాత్రం రాజస్థాన్ గెలవడం పక్కా అంటున్నారు.

బౌలింగులో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్ తదితరులున్నారు. మరి ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Big Stories

×