IPL 2024 66th Match – Sunrisers Hyderabad Vs Gujarat Titans Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో దురదృష్టకరమైన జట్టు ఏదన్నా ఉందంటే.. అది గుజరాత్ టైటాన్స్ అని చెప్పాలి. మొదట్లో చాలా మ్యాచ్ లు ఓడిపోయి, అప్పుడే టచ్ లోకి వచ్చి ముందుకి దూసుకుపోదాం అనుకునే సమయంలో కోల్ కతాతో జరగాల్సిన మ్యాచ్ మొత్తం వర్షార్పణమైంది. దీంతో కోల్ కతా – గుజరాత్ కి చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో 11 పాయింట్ల దగ్గర గుజరాత్ ఆగిపోయింది.
నేడు ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ తో ఆడనుంది. ఇప్పుడు వీరిపై గెలిచినా 13 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఈసారికి ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే. కానీ హైదరాబాద్ వైపు చూస్తే మాత్రం.. వీరికి గెలవకతప్పని మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి 14 పాయింట్లతో ఉంది. గుజరాత్ పై గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి దర్జాగా వెళ్లిపోతుంది. లేదన్నా పర్వాలేదు. ఎందుకంటే తనకి మరో మ్యాచ్ కూడా ఉంది. అందువల్ల అందులో గెలిచినా 16 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. ప్రస్తుతం సేఫ్ జోన్ లోనే ఉందని చెప్పాలి.
Also Read: SRH vs GT IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్
ఈ రెండు జట్ల మధ్య నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ 3 గెలిస్తే, హైదరాబాద్ ఒకటి మాత్రమే విజయం సాధించింది.
హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర టాప్ ఆర్డర్ దే అని చెప్పాలి. ట్రావిస్ హెడ్ దంచి కొడుతున్నాడు. అభిషేక్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, వీళ్లందరూ స్కోరుని టాప్ గేర్ లోకి తీసుకువెళుతున్నారు. బౌలింగులో కూడా భువనేశ్వర్, కమిన్స్, నటరాజన్, మార్కో జాన్సన్ అందరూ బాగా ఆడుతున్నారు. కానీ ఒకొక్కసారి అయితే త్వరగా అయిపోతున్నారు, లేదంటే చితక్కొట్టేస్తున్నారు. మరి రేపు నిలబడతారా? తడబడతారా? అనేది తెలీదు.
Also Read: విరాట్ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కోహ్లీ బాబర్..
గుజరాత్ టైటాన్స్ పగ్గాలను హార్దిక్ పాండ్యా నుంచి శుభ్ మన్ గిల్ కి వచ్చాయి. తనవరకు బాగా ఆడానని అనిపించాడు. జట్టుని నడిపించడంలో కొంత ఇబ్బందిపడుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ పరంగా చూస్తే, మ్యాచ్ లో సందర్భాన్ని బట్టి బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ సెట్ చేయడం లాంటి మూమెంట్స్ పెద్దగా కనిపించడం లేదు. జట్టు అంతా కూడా ఒకరిద్దరిపైనే డిపెండ్ అయి ఉంది. అందువల్లే ఇంతదూరం వచ్చిందని అంటున్నారు.
మరి నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.