BigTV English

Gold Production in AP: ఏపీలో బంగారం ఉత్పత్తి మొదలు.. టార్గెట్ 750 కిలోలు..!

Gold Production in AP: ఏపీలో బంగారం ఉత్పత్తి మొదలు.. టార్గెట్ 750 కిలోలు..!

Gold Production Start in AP’s Kurnool: చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో బంగారం ఉత్పత్తి మొదలు కానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అంతేకాదు మనదేశంలో ప్రైవేటు రంగంలో ఫస్ట్ గోల్డ్ మైన్ ఇదే.


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనిలో కొద్దిరోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60 శాతం పూర్తి కావడంతో నాలుగైదు నెలల్లో ఉత్పత్తి మొదలు కానున్నట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది.

దీనికోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడం, ప్లాంట్ పనులు చేపట్టింది. ఏటా 750 కిలోల బంగారు ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ అంచనా. ఇప్పటివరకు ఈ బంగారు గనిపై దాదాపు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని పసిడి గనులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిని తవ్వేందుకు ప్రభుత్వ రంగం సంస్థ ఎన్ఎండీసీ ముందుకొచ్చింది. వీటిని తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది కూడా.


Also Read: CM Jagan talks I pak team: అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్

రాయలసీమలో బంగారం కోసం అన్వేషణ ఈనాటిది కాదు. బ్రిటీష్ పాలనకు ముందు మహమ్మదీయులు,  శ్రీకృష్టదేవరాయుల కాలంలో ఏపీలో మైనింగ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలు బంగారం, వజ్ర సంపద ఉన్న ప్రాంతంలో అశోకుడు ఆయన అధికారులు విడిది చేశారని అంటున్నారు. ఇందుకు సాక్ష్యం జొన్నగిరి సమీపంలో అశోకుని శిలాశాసనాలు ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తానికి రాయలసీమ పసిడికి ఉత్పత్తికి వేదిక కానుందన్నమాట.

బంగారం గనుల కోసం దేశంలో విపరీతమైన పోటీ నెలకొంది. రాజస్థాన్‌లో రెండు గనుల కోసం వేదంతా గ్రూప్, హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్ ఇందులో ఉన్నాయి. కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్ పూరా బ్లాక్‌లను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వేలం నిర్వహిస్తోంది.

Also Read: రఘురామరాజు క్లారిటీ, 130 సీట్లు కూటమిదే, దేవుడు రాసిన స్క్రిప్ట్

దక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ విషయానికొస్తే.. దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తోంది. ఈ సంస్ధ విదేశాల్లోనూ గనుల ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది. దీన్ని అక్కడి మాగ్నిఫికా గ్రూప్‌తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. అందులో దక్కన్ గోల్డ్ మైన్స్‌కు 51 శాతం ఉండగా, దాన్ని 75 శాతానికి పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది.

Tags

Related News

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Amaravati ORR: అమరావతి ORRకు వేగం.. భూసేకరణ మొదలు.. ఆ నగరాలకు పండగే!

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

Anantapur News: దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. ముట్టడికి జూనియర్ ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

Big Stories

×