BigTV English

IPL 2024 Orange Cap Winner: ఐపీఎల్ 2024 సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేత.. విరాట్ కోహ్లీ!

IPL 2024 Orange Cap Winner: ఐపీఎల్ 2024 సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేత.. విరాట్ కోహ్లీ!

IPL 2024 Virat Kohli Wins Orange Cap with 741 Runs: తను ఏ జట్టులోనైనా ఉండనీ, అది జాతీయ జట్టు అయినా, ఐపీఎల్ జట్టు అయినా సరే, ఆ జట్టు గెలవనీ, ఓడనీ తను మాత్రం ఒక్కడు వికెట్లకు అడ్డంగా నిలబడిపోతాడు. తన స్టయిలిష్ ఆటతో అదరగొడతాడు. ధూంధామ్ చేస్తాడు. విశ్వరూపం చూపిస్తాడు. అతను మరెవరో కాదు.. టీమ్ ఇండియా మూలస్తంభం.. విరాట్ కొహ్లీ


ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ, రికార్డులను తిరగరాస్తూ 8000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్న విరాట్ కొహ్లీ మరొక అరుదైన పురస్కారం అందుకోనున్నాడు.

అదేమిటంటే ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సబీ తరఫున ఆడిన కొహ్లీ.. 15 మ్యాచ్ లు ఆడి 741 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. నిజానికి తన దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇంకా 5 ఆఫ్ సెంచరీలు చేశాడు. 61.75 యావరేజ్, 154.69 స్ట్రయిక్ రేట్ తో ఇరగదీశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరేవరకు తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించాడు.


నిజానికి ప్లే ఆఫ్ లోని ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ అనూహ్యంగా రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు లీగ్ మ్యాచ్ ల్లో కిందకు పడి, తర్వాత వేగంగా పుంజుకుని రాణించిన జట్టు, సరిగ్గా ఆడాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. అయితేనేం ఒక ఆటగాడిగా కొహ్లీ మాత్రం నిరూపించుకున్నాడు. తన మార్కు ఆటతో ఎప్పటిలా నెంబర్ వన్ గా నిలిచాడు.

Also Read: కావ్య మారన్ కంటతడి, ఓటమిని తట్టుకోలేక, ఆపై

కొహ్లీ తర్వాత రెండో స్థానంలో చెన్నయ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (583) పరుగులతో ఉన్నాడు. ఇక వరుసగా చూస్తే… రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ (573)
హైదరాబాద్ సన్ రైజర్స్ నుంచి ట్రావిస్ హెడ్ (567)
రాజస్థాన్ రాయల్స్ నుంచి కెప్టెన్ సంజూ శాంసన్ (531)
గుజరాత్ టైటాన్స్ నుంచి సాయి సుదర్శన్ (527)
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కెప్టెన్ కేఎల్ రాహుల్ (520)
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి నికోలస్ పూరన్ (499)
కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి సునీల్ నరైన్ (488)
హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ (484)

ఇలా వరుసగా ఉన్నారు. అయితే వీరిలో కనీసం ఎవరూ కూడా 600 పరుగుల వరకు రాలేదు. కానీ విరాటుడు మాత్రం 741 పరుగులు చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

Related News

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Big Stories

×