13 Killed due to Remal Cyclone Effect in Telangana: రెమాల్ తుఫాన్ ప్రభావం వల్ల పలు జిల్లాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అకాల వర్షం, ఈదురు గాలులు కారణంగా పలువుకు మృతి చెందారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ప్రజలను అతలాకుతలం చేసింది. ఆదివారం నాడు మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు తీవ్రంగా ఎండ కాస్తూ ఉన్నట్లుండి వర్షం.. ఈదురుగాలులతో పలు జిల్లాల్లో 13 మంది మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు.
భారీగా ఈదురు గాలులు వీయడంతో షెడ్డు కూలిపోయి తండ్రీ కూతుళ్లు సహా నలుగురు మృత్యువాతపడ్డారు. పలు చోట్ల పిడుగుపాటుతో ఇద్దరు, ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో నలుగురు, మెదక్ లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు. కాగా పలు చోట్ల ఈదురు గాలులు వల్ల భారీ వృక్షాలు, కరెంట్ స్థంభాలు విరుచుకుపడ్డాయి. దీంతో చాలా చోట్ల ట్రాపిక్ జామ్ అయింది. గంటలతరబడి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ వర్షం.. ఈదురు గాలులు ధాటికి రోడ్ల మీద, ఇంటి ఆవరణాల్లో వస్తువులు చెల్లాచెదురు అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాను భారీ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. రంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గాలీ భీభత్సం సృష్టించింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశెర్లపాడు మండలం ఘన్‌పూర్, ఇబ్రహీంపేట, గుర్రంపోడు మండలాల్లో మోస్తారు వర్షాలు కురిసాయి.
హైదరాబాద్ లో మధ్యాహ్న సమయంలో భారీగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు పలు చోట్ల ఇళ్లు, వాహనాలు, భారీ వృక్షాలు విరుచుకుపడ్డాయి. అంతే కాకుండా ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఈదురు గాలులకు భారీ వర్షం తోడవ్వడంతో ప్రజలు వణికిపోయారు. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ వరకూ, మల్కాజిగిరి, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ అనేక చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం 6 గంటల సమయంలో కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్‌లో భారీ వర్షం కురవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Also Read: ఛాతీలో బాణం దిగిన యువకుడిని కాపాడిన వైద్యులు.. అభినందించిన సీఎం రేవంత్
ఒక వైపు వర్షం పడుతుంటే పలు ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువైంది. ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఏకంగా 46. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాలలో 46.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 45.2, మంచిర్యాల జిల్లాలో 45.1, నిర్మల్ జిల్లాలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.