Kavya Maran Tears After SRH Loss in Final Match in IPL 2024 Season: ఐపీఎల్-2024 టోర్నమెంట్ ముగిసింది. ఎలాంటి అంచనాలు లేని జట్లు ఫైనల్‌కు చేరాయి. చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కప్పు ఎగురేసుకుపోయింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చతకిలపడిపోయింది. రాణిస్తారని భావించిన బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు.
ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డులు బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చివరకు ఆ జట్టు ప్రదర్శన చూసి అందరూ షాకయ్యారు. సగటు సన్‌రైజర్స్ అభిమానులు సైతం ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. ఎంత చెత్తగా ఆడారంటే చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యమారన్ కంటతడి పెట్టేవరకు తీసుకెళ్లారు ఆటగాళ్లు.
జట్టు ఓటమి తర్వాత కావ్య మారన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కెమెరాకు కనిపించకుండా వెనక్కి తిరిగి కంటపడి పెట్టడం గమనార్హం. పక్కనున్న టీమ్ సభ్యులు సముదాయించినా కన్నీరు ఏ మాత్రం ఆగలేదు. జట్టు ఓడిపోయిందన్న బాధ ఓ వైపు వెంటాడుతున్నా, చప్పట్లతో గెలిచిన జట్టుకు మద్దతు తెలుపుతూ అభినందించారు. కెమెరా కంట పడకుండా కన్నీరు తుడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
Also Read: ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్..
గతంలో కూడా హైదరాబాద్ జట్టు ఓడిన సందర్భాల్లో ఆమెలో నిరాశ కనిపించిందే తప్పితే, కంటతడి పెట్టిన సందర్భం లేదు. కానీ ఫైనల్‌లో చిత్తవ్వడంతో భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. మరి తప్పు ఎవరిది? ఆటగాళ్లా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. నిజానికి చెప్పుకోవాలంటే కమిన్స్, భువనేశ్వర్ తప్పితే పెద్దగా బౌలర్లు లేని కొరత ఆ జట్టును వెంటాడింది. ఓటమిని ముమ్మాటికీ ఇదే కారణమైందన్నది అభిమానులతోపాటు విశ్లేషకులు చెబుతున్నమాట.
హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్యమారన్ ఎవరో తెలుసా? సన్‌గ్రూప్ ఛైర్మన్, ఫౌండర్ అయిన కళానిధి మారన్ గారాలపట్టి. కొన్నాళ్ల వరకు ఆమె ఎవరికీ పెద్దగా తెలీదు. ఐపీఎల్ పుణ్యమాని ఆమె బాగా ఫేమస్ అయ్యారు. స్టేడియంలో కావ్య ఎక్కడుంటే కెమెరాలు ఆమెపై కన్నేస్తాయి. ఆమె హావభావాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నాయి. అయినా ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవడం సహజం. కన్నీళ్లను గుణపాఠం చేసుకుని వచ్చే ఏడాదిలో జరగనున్న టోర్నీలో ఆ జట్టు విజయం సాధించాలని ఆశిద్ధాం.
Also Read: Kavya Maran addresses SRH players: డ్రెస్సింగ్ రూమ్‌లో కావ్యమారన్, కేవలం నాలుగు మాటలు..
Kavya Maran was hiding her tears. 💔
– She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024
Shreyas Iyer – Absolute Rockstar in celebration. 😄🔥
The party mode at KKR hotel. pic.twitter.com/qb8Rx9jBPF
— Johns. (@CricCrazyJohns) May 27, 2024