IPL 2025: ఐపీఎల్ 2025 ( IPL 2025) వేలానికి రంగం సిద్ధమవుతోంది. 2025 సీజన్ కోసం నవంబర్ లోనే వేలం జరగబోతోంది. ఈసారి జట్ల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే ప్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. కోర్ టీం లను అట్టిపెట్టుకున్నాయి. మిగతా వారిని వేలంలో ప్లేయర్లను తీసుకొనున్నారు. ఈనెల 24, 25న జెండా వేదికగా ఐపిఎల్ వేలంలో జరగనుంది. వేలం కోసం 1,574 మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. భారత ప్లేయర్లు 1,165 మంది ఉన్నారు. వేలంలో ఓవర్సీస్ ఆటగాళ్ల సంఖ్య 409. భారత్ తరఫున క్యాప్డ్ ప్లేయర్లు 48 మంది ఉన్నారు.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
క్యాప్డ్ అంతర్జాతీయ ప్లేయర్లు 272 మంది వేలంలో తమ లక్ పరీక్షించుకోనున్నారు. మొత్తంగా చూసుకుంటే 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అనుబంధ దేశాల ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. రేసులో భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరు ఎక్కువ ధరను దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలోకి వచ్చాడు. కనీస ధర నాలుగు కోట్లతో పంత్ బరిలో నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ యువ వికెట్ కీపర్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. టాప్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లోను అద్భుతంగా రాణించాడు. భారత జట్టు ఓటమిపాలైనప్పటికీ పంత్ అద్భుతంగా ఆడాడు. ఫార్మాట్ ఏదైనాప్పటికీ అగ్రెసివ్ గా ఆడే పంత్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీ పడేలా చేశారు. దీంతో పంత్ ను ఏ జట్టు తీసుకుంటుందని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి వేయంలో పంత్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని అంటున్నారు. కెప్టెన్ గా , వికెట్ కీపర్ గా పంత్ ఉపయోగపడతాడనే ఆలోచనలో ఫ్రాంచైజీలు అన్నీ ఉన్నాయి. ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ పైన ( Sheyas Iyer) ప్రతి ఒక్కరి దృష్టి పడనుంది.
గత సీజన్లో కోల్కత్తా నైట్ రైడర్స్ ను శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ ఈ యంగ్ ప్లేయర్ ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. శ్రేయస్ అయ్యారే ఆ జట్టును వదిలేసాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది. కెప్టెన్సీ మెటీరియల్ గా ఈ యంగ్ ప్లేయర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. కేకేఆర్ తరపున తన ఆట తీరును నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శ్రేయస్ రెండు కోట్ల వేలం బరిలో నిలుస్తాడు. ఛాంపియన్ కెప్టెన్ కోసం వేలంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వేలంలో రికార్డులు బద్దలు అయినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అటు కేఎల్ రాహుల్ ను ( Kl rahul ) కూడా భారీ ధరకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అయితే.. పంత్, రాహుల్, అయ్యర్ తలో రూ.30 కోట్లు పలికితే.. వారికే రూ.90 వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.