PBKS vs RCB final : ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు అంతా మేఘావృతంగా ఉండే అవకాశంగా ఉందని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మితమైన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్ లో ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఇప్పటివరకు ట్రోఫీ దక్కించుకోలేదు. బెంగళూరు తమ ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్ కి వెళ్లి.. రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ కి వెళ్లింది. అయితే 2014 సీజన్ లో జరిగిన ఆ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఓడిపోయింది పంజాబ్ కింగ్స్.
Also Read : PBKS vs RCB : RCB వెన్నులో వణుకు… బాహుబలి సీన్ రిపీట్
ప్రధానంగా జూన్ 03న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ పై వాతావరణం కీలక పాత్ర పోషించనుంది. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కూడా వర్షం కారణంగా మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. రేపు కూడా అలాగే వర్షం వస్తే.. మరోసారి పంజాబ్ కింగ్స్ కి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని.. ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ తొలుత మే 25న కోల్ కతా లో జరగాల్సి ఉంది. కానీ వర్షాకాలంలో కోల్ కతా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణ కారణాల వల్ల మ్యాచ్ ను ఈడెన్ గార్డెన్ నుంచి మార్చారు. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లను అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి తిరిగి కేటాయించారు. జూన్ 01న జరిగిన క్వాలిఫయర్ 2 వర్షం కారణంగా టాస్ తరువాత మ్యాచ్ జరగడానికి దాదాపు 2 గంటల వరకు ఆలస్యం అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. రాత్రి 9.44 గంటలకు ప్రారంభమైంది. రేపు జరుగబోయే ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
అయితే ఫైనల్ మ్యాచ్ జూన్ 03న మంగళవారం జరుగనుంది. అయితే ఆ రోజు వర్షం వల్ల ఒకవేళ మ్యాచ్ జరుగకపోతే.. రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినా.. మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే జూన్ 04న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డే రోజు ఒకవేళ వర్షం కారణం మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది కలిగినట్టయితే.. కనీసం 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహిస్తారు. రెండు రోజులు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కానీ పక్సంలో పంజాబ్ జట్టు ఐపీఎల్ 2025 విజేతగా నిలుస్తుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో కొనసాగిన పంజాబ్ కింగ్స్ జట్టు విజేతగా నిలుస్తుంది.