BigTV English

Venkatesh: అతను స్వార్దపరుడు.. మైండ్ గేమ్స్ ఆడతాడు.. నాకు అవి రావు

Venkatesh: అతను స్వార్దపరుడు..  మైండ్ గేమ్స్ ఆడతాడు.. నాకు అవి రావు

Venkatesh: ఇండస్ట్రీలో ఎలాంటి ట్రోల్స్ లేకుండా.. ఎలాంటి వివాదాలు లేకుండా అందరి ఫ్యాన్స్ కు నచ్చే ఏకైక హీరో వెంకటేష్. స్టార్ హీరో సినిమాలకు వారి ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు. కానీ, వెంకీ మామ సినిమాకు ఆ స్టార్స్ కూడా వెళ్తారు. అలాంటి సినిమాలు తీయడంలో వెంకీ దిట్ట. కుటుంబ కథా చిత్రాలు, ప్రజలను ఆలోచింపజేసే చిత్రాలు తెరకెక్కించి ఎంతో మంచి గుర్తింపును.. విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు వెంకీ.


 

ఇంకా ఆ పేరును మొత్తం ఒక్కసారిగా పోగొట్టింది రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో  బాబాయ్ – అబ్బాయ్ అయిన రానా, వెంకటేష్.. తండ్రీకొడుకులుగా కనిపించారు. ఇద్దరు కలిసి ఒక సిరీస్ లో నటిస్తున్నారు అని ఆనందపడేలోపు.. నెట్ ఫ్లిక్ సిరీస్ కావడంతో హద్దులేని బూతులు, వల్గారిటీ చూపించారు. అసలు మా వెంకటేష్ యేనా ఇలాంటి పదాలు మాట్లాడుతుంది.. ? ఇంత వల్గర్ గా నటించింది.. ? అని అనుకున్నారు అభిమానులు.


 

మొట్టమొదటిసారి వెంకీ ట్రోలింగ్ కు గురయ్యాడు. ఆ తరువాత ఆయన కూడా ఈ సిరీస్ చేయకుండా ఉండాల్సింది అని రియలైజ్ అయినా.. సీజన్ 2 కూడా చేయాల్సిన పరిస్థితి. అందుకే ఏమి చేయలేక వెంకీ.. రానా నాయుడు సీజన్ 2 లో కూడా నటించాడు. ఈ సిజన్ 2 రిలీజ్ కు ర్వాడీ అవుతోంది. నాగ నాయుడుగా వెంకీ కనిపించిన విషయం తెల్సిందే. తండ్రీకొడుకుల మధ్య యుద్ధం ఈ సీజన్ లో తారాస్థాయికి చేరుకుంటున్నట్లు మొదట్లోనే చూపించారు. కొడుకు కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిన నాగ నాయుడు.. కొడుకు ప్రాబ్లమ్ లో ఉన్నాడని తెలుసుకొని మళ్లీ వస్తాడు అనే లైన్ మాత్రమే సీజన్ 1 చివర్లో చూపించారు.

 

జూన్ 13 నుంచి రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన వెంకీ.. తాజాగా తన పాత్ర అయిన నాగ నాయుడు గురించి చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో తనకి, నాగకు ఎలాంటి సంబంధం లేదని, అతడు స్వార్దపరుడు అని తెలిపాడు. తాను బయట ఎప్పుడు అలా ఉండను అని చెప్పిన వెంకీ..  ఎలాఉన్నా  నాగ కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ఎన్ని తప్పులు అయినా చేస్తాడు. ఆ పాయింట్ నచ్చడంతోనే తాను ఈ పాత్ర చేసినట్లు చెప్పుకొచ్చాడు.

 

నిజ జీవితంలో తనకు మైండ్ గేమ్స్ ఆడడం నచ్చవని.. సిరీస్ లో నాగ అలాంటి మైండ్ గేమ్స్ బాగా ఆడతాడని చెప్పుకొచ్చాడు. బయట నేను ఎప్పుడు, ఎలా ఉంటానో అనేది అందరికీ తెలుసు.. కానీ, నాగ ఎప్పుడు ఏది చేస్తాడో ఎవరికీ తెలియదని తెలిపాడు. మరి ఈ సీజన్ కూడా బూతులతో నిండిపోతుందా.. ? కథను ఏదైనా మార్చారా.. ? అనేది తెలియాలంటే రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×