OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాలా రోజుల తర్వాత థియేటర్లో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఇంకా ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు, గతంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..
మొదటి స్థానంలో ఓజీ….
ఈ సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజీ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. హరిహర వీరుమల్లు షూటింగ్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇదీ కదా పవన్ రేంజ్…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నైజాం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా జరగని విధంగా ఓజీ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగటం విశేషం. ఒక నైజం ఏరియాలోనే ఈ సినిమా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇప్పటివరకు నైజాంలో రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ నటించిన RRR సినిమా 70 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ప్రభాస్ కల్కి సినిమా 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని రెండో స్థానంలో ఉండేది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఈ రెండు సినిమాలను వెనక్కినెట్టి మొదట స్థానంలో నిలిచింది.
Top 3 Nizam Pre Release Business :
1. #TheyCallHimOG – 90cr
2. #RRR – 70CR
3. #KALKI2898AD – 65CRAll Time record for any pre release business..🔥🔥 pic.twitter.com/GQDNjNumr9
— Tejjj 🦅 (@tej_balaji_9) June 2, 2025
ఇలా పవన్ కళ్యాణ్ సినిమా నైజాం ఏరియాలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిజినెస్ లెక్కల పై అభిమానులు స్పందిస్తూ…మీ స్టామినా ఇదయ్యా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెండితెరపై కనబడితే చాలు అభిమానులకు పూనకాలు వస్తాయి. అలాంటిది ఒక గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపించబోతున్నారని తెలియగానే ఈ సినిమా చూడటం కోసం అభిమానులు కూడా అంతే ఆత్రుత కనబరుస్తున్నారు. ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే… జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.