Hair Extensions: జుట్టు అందంగా పొడవుగా కనిపించాలని చాలా మంది హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడతారు. జుట్టు పల్చగా ఉందని, మాడును కనిపించకుండా చేయాలని వీటిని వాడే వారు ఎక్కువ మందే ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ సమయం పాటు ఉంచడం వల్ల చాలా మందికి చర్మంపై దురద, దద్దుర్లు వచ్చాయట.
తరచుగా వాడి తొలగించినప్పుడు హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌తో పాటు వెంట్రుకలు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. కొన్ని సార్లు సరిగా శుభ్రం చేయకుండా వాడే హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వల్ల ఇన్‌ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
క్యాన్సర్ కారకాలు..!
అంతేకాకుండా వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సింథటిక్ హెయిర్ ప్రొడక్ట్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్ ఉన్నాయని కన్స్యూమర్ రిపోర్ట్స్ చేసిన కొత్త పరిశోధనలో వెల్లడైంది.
తరచుగా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడడం వల్ల మైలాయిడ్ లుకేమియా అనే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీటిలో ఉండే బెంజీన్ అనే కెమికల్ ఈ క్యాన్సర్‌కు దారి తీస్తుందట. అంతేకాకుండా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ తయారు చేయడానికి వాడే మిథైలిన్ క్లోరైడ్ వల్ల లివర్, లంగ్స్‌పై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందట. కొన్ని సందర్భాల్లో దీని వల్ల క్యాన్సర్ కూడా రావచ్చని అంటున్నారు.
హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ను వారాల తరబడి తలకు ఉంచడం వల్ల చర్మంపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉందట. అందుకే వీటి వాడాకాన్ని వీలైనంత వరకు తగ్గించడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే సేఫ్..
హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టును శుభ్రం చేసుకున్నట్టుగానే హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వీటిని వారాల తరబడి వాడడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని సార్లు హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వల్ల చర్మంపై దద్దుర్లు కూడా రావచ్చట. అందుకే వీటిని వీలైనంత తక్కువ సమయం తలలో ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: పసుపు వల్ల సైడ్ ఎఫెక్ట్స్..!
హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ తయారు చేయడానికి వాడే కెమికల్స్, సింథటిక్ పదార్థాల వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని కొంత వరకైనా రక్షణ పొందాలంటే ఏ రకమైన హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారు అనేదానిరపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అందుకే మంచి కంపేనీలకు చెందిన ప్రొడక్ట్స్‌ని మాత్రమే వాడడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.