IPL 2025 Reschedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ ( IPL 2025 Reschedule) తేదీలు ఖరారు అయ్యాయి. మే 17వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు… భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటన చేసింది. మే 17వ తేదీన రీ షెడ్యూల్ కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) జూన్ మూడవ తేదీ వరకు జరగనుంది. అంటే ఈ లెక్కన జూన్ మూడవ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది. వాస్తవానికి మే 25వ తేదీన మొదటి షెడ్యూల్ ప్రకారం… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మొదటి షెడ్యూల్ రద్దయింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఫైనల్ చేశారు.
ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఈ టోర్నమెంట్… పునః ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ… మే 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆరోజున బెంగళూరు వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడతాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
ఫైనల్ ఎప్పుడు అంటే ?
అలాగే… మే 25 వ తేదీన జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ జూన్ మూడవ తేదీన జరగనుంది. అలాగే క్వాలిఫైయర్ అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే… మే 29వ తేదీన క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరగనుంది. మే 30వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ ఒకటో తేదీన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ( Final Match) జూన్ మూడవ తేదీన జరగనుంది. అయితే ఈ నాకౌట్ మ్యాచ్ ల వేదికలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఈ మ్యాచ్ ల వేదికలు ఫైనల్ కాబోతున్నాయి. ఆ లోపు గ్రూప్ స్టేజి మ్యాచులు పూర్తవుతాయి. మే 29వ తేదీ వరకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం కూడా పూర్తిగా చల్లారే ఛాన్స్ ఉంటుంది.
ఆరు వేదికలలో మ్యాచులు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) రీ షెడ్యూల్ ప్రకారం 6 వేదికలను ఫైనల్ చేశారు. ఈ లిస్టులో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వేదికలు ఉన్నాయి. ఈ ఆరు వేదికలలోనే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు అన్నీ జరుగుతాయి. అయితే ఈ నెల 24వ తేదీన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొన్న రద్దయిన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ వేదిక అవుతుంది. అందుకే మొత్తం మిగిలినవి 17 మ్యాచ్ లని ప్రకటన చేశారు.
🚨 IPL 2025 Playoffs Schedule 🚨
Qualifer 1: 29th May
Eliminator: 30th May
Qualifer 2: 1st June
Final: 3rd June
Breaking pic.twitter.com/rou66IQt1i
— RVCJ Sports (@RVCJ_Sports) May 12, 2025