BigTV English

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !

Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !

Suryakumar Yadav: ఈనెల 22వ తేదీ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 18వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ మార్చ్ 23న జరుగుతుంది. ఇక గత సంవత్సరం తీవ్రంగా నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలన్న పట్టుదలతో ఉంది.


 

అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఓ ఎదురు దెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నాడు. ఎందుకంటే అతడిపై ఓ మ్యాచ్ నిషేధం ఉండడమే. ఈ నిషేధం గత సీజన్ లోది కావడం గమనార్హం. గత సంవత్సరం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్ రేట్ కి పాల్పడింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా 30 లక్షల జరిమానా ఎదుర్కోవడంతో పాటు ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.


అయితే గత సంవత్సరం ముంబై జట్టు దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ కి దూరం కావడంతో హార్దిక్ పాండ్యా పై మ్యాచ్ నిషేధం సాధ్యం కాలేదు. దీంతో ఈ సీజన్ లో ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరమవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. ముంబై జట్టును ఎవరు నడిపించనున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

గాయం కారణంగా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బూమ్రా కూడా ఆరంభ మ్యాచ్ లకి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే హార్దిక్ పాండ్యా పై వేటుపడ్డ నేపథ్యంలో తొలి మ్యాచ్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ తిరిగి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడా..? లేక సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం కల్పిస్తారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక సూర్య కుమార్ యాదవ్ కి టి-20 క్రికెట్ లో కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 18 మ్యాచ్లలో.. కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది.

 

ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక రోహిత్ శర్మన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013, 15, 17, 19, 2020 సంవత్సరాలలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ 158 మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో ముంబై జట్టు 87 మ్యాచ్లలో గెలుపొందింది. మరో 67 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. ఇక ఐపీఎల్ 2024 కి ముందు అనూహ్యంగా రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది మేనేజ్మెంట్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×