Big Stories

IPL Auction: ఐపీఎల్ వేలం ఎప్పటి నుంచి అంటే…

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ సీజన్‌ 2023 కోసం వేలంపాట వేదికతో పాటు… తేదీని కూడా బీసీసీఐ ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది. కేరళలోని కొచ్చిలో ఐపీఎల్ 2023 మినీ వేలాన్ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 23న వేలం నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం… కొందరు ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న ఆటగాళ్లకు ఉద్వాసన పలకవచ్చని చెబుతున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో పాటు రొమారియో షెప్పర్డ్, జగదీశ్ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని సమాచారం. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొందరు ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్ లను సీఎస్కే విడుదల చేయొచ్చని అంటున్నారు.

- Advertisement -

మరోవైపు… వేలంలో పాల్గొనే యాజమాన్యాల్లో కొన్నింటి దగ్గర డబ్బు బాగానే ఉన్నా… ఓ ఫ్రాంచైజీ దగ్గర అసలు లేదు. ప్రస్తుతం
ఐపీఎల్‌లోని 10 జట్ల దగ్గర 90 నుంచి 95 కోట్ల బ్యాలెన్స్ ఉంది. దీనితోనే ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.3.45 కోట్లు ఉండగా… చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.95 లక్షలు, గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.15 లక్షలు, ముంబై ఇండియన్స్ దగ్గర రూ.10 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 10 లక్షలు, ఢిల్లీ కాపిటల్స్ వద్ద రూ. 10 లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక్క లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర మాత్రం డబ్బులు అస్సల్లేవు. అయితే మినీ వేలంలో పాల్గొనే ప్రతి ప్రాంచైజీ… తన దగ్గరున్న మొత్తం కన్నా అదనంగా రూ. 5 కోట్ల వరకు వేలంలో ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News