Rashmika Mandanna : రష్మిక మందన్న.. ఈ క్ననడ బ్యూబీ ఓ వైపు దక్షిణాదిన అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోంది. మరో వైపు బాలీవుడ్ సినిమాల్లోనూ చేస్తుంది. ఈ రెండింటితో పాటు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆమె నటిస్తుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తుందిగా అని అందరూ అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా వేదిగా ఆమె చేసిన లేటెస్ట్ పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందో తెలుసా.. తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించింది రష్మిక లెటర్ రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. కాస్త స్ట్రాంగ్‌గానే ఆమె రియాక్ట్ అయ్యింది.
‘‘కొన్నేళ్లుగా కొన్ని విషయాలు నన్నెంతగానో ఇబ్బంది పడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో చెప్పుకోవాలి. నా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నాను. అయితే నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ప్రతి ఒక్కరి ప్రేమను పొందకపోవచ్చు. అందరికీ నేను నచ్చాల్సిన అవసరం లేదు. అయితే నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందరూ గర్వించేలా కష్టపడుతున్నాను. అయితే నేను మాట్లాడని మాటలను కూడా గురించి కూడా హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నేను ఇంటర్వ్యూల్లో మాట్లాడుకున్న మాటలను నెగిటివ్ కోణంలోనే చూస్తున్నారు. ఇలాంటి చర్యలు వల్ల ఎంతో ఇబ్బందిగా మారింది. విమర్శలను పట్టించుకోకూడదని అనుకుంటున్నప్పటికీ సిట్యువేషన్ ఇంకా దిగజారుతుంది. నా చుట్టు ఉన్న వారి నుంచి ఇన్‌స్పిరేషన్ పొందాను. ఫ్యాన్స్ ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది’’ అన్నారు.