Big Stories

Delhi : ఢిల్లీలో అర్ధరాత్రి హైడ్రామా.. రెజ్లర్లు, పోలీసులకు మధ్య తోపులాట..

Wrestlers Protest News(Breaking News India) : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2వారాలుగా న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్స్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెజ్లర్ల దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు పోలీసులు. పోలీసులను రెజ్లర్స్ తీవ్రంగా ప్రతిఘటించడంతో..కాసేపు హైడ్రామా నెలకొంది. పోలీసుల తీరుపై రెజ్లర్స్ మండిపడ్డారు. దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు.

- Advertisement -

రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్స్ ధర్నా చేస్తున్నారు. రెజ్లింగ్ చీఫ్ పదవీ నుంచి బ్రిజ్ భూషణ్ ను తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దీక్షా శిబిరం వద్దే ఉంటూ పోరాటం కొనసాగిస్తున్నారు.

- Advertisement -

వర్షం కారణంగా దీక్షా శిబిరంలోని పరుపులు తడిసిపోవడంతో మడత మంచాలను తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, రెజ్లర్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో మహిళ రెజ్లర్స్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై రెజ్లర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ క్రిమినల్స్ కాదన్నారు. మగ పోలీసులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్స్ ఆరోపించారు.

రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ జనవరిలో తొలుత రెజ్లర్స్ నిరసన చేపట్టారు. దీంతో క్రీడా మంత్రిత్వ శాఖ.. నిజ నిర్థారణ కోసం ఓ కమిటీ వేసింది. కానీ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 23న రెజ్లర్స్ మరోసారి నిరసన బాట పట్టారు. బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై రెండు కేసులు నమోదు చేశారు.

లైంగిక ఆరోపణలతో రెండు కేసులు నమోదు అయినా.. ఇప్పటికే రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్ గా అతనే కొనసాగడంపై రెజ్లర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ నిష్ఫక్షపాతంగా జరగాలంటే.. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News