BigTV English

Shubman Gill: గిల్.. ఎంత పని చేశావ్? సారాని వదిలి.. అవనీత్ ని పట్టావా?

Shubman Gill: గిల్.. ఎంత పని చేశావ్? సారాని వదిలి.. అవనీత్ ని పట్టావా?

Is Shubman Gill dating actress Avneet Kaur: టీమ్ ఇండియాలో నిఖార్సయిన బ్యాటర్ గా ఎదిగి, ఇప్పుడు ఫామ్ లేక తంటాలు పడుతున్న శుభ్ మన్ గిల్.. నెట్టింట మరో ట్రెండింగ్ లోకి వెళ్లాడు. ఎందుకంటే ఇటీవలే తన 25వ జన్మదినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాడు. ‘మందేస్తూ చిందేయ్ రా.. చిందేస్తూ మందేయ్ రా’పాట స్టయిల్ లో స్టెప్స్ వేస్తూ అదరగొట్టాడు.


అయితే పార్టీకి స్నేహితులతో పాటు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ తదితరులు వచ్చారు. అందరూ మంచి జోష్ లో ఆడుతూ పాడుతూ కనిపించారు. కట్ చేస్తే బర్త్ డే అయిపోయింది. కానీ ఒకరి నుంచి రావల్సిన బర్త్ డే విషెస్ మెసేజ్ రాలేదు. కానీ మరొకరి దగ్గర నుంచి వచ్చింది. దీంతో ఒక్కసారి నెట్టిల్లు వేడెక్కింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇన్నాళ్లూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని భావిస్తున్న సారా టెండుల్కర్- శుభ్ మన్ గిల్ ఇద్దరి మధ్యా బ్రేకప్ అయ్యిందని అంటున్నారు. అందుకు నిదర్శనంగా సారా తనకి బర్త్ డే  సెలబ్రేషన్స్ కి రాలేదు, కనీసం విషెస్ చెప్పలేదు. అయితే మరోవైపు నుంచి సినీ నటి అవనీత్ కౌర్ బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు, తామిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఒక్కసారి నెట్టింట అగ్గి పుట్టింది.


Also Read: ఆస్ట్రేలియా టూర్‌కి ముషీర్ ఖాన్ ? టీమ్ ఇండియాలో చోటు?

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ అభిమానులు గిల్ పై సీరియస్ అవుతున్నారు. గతంలో ఇలాగే ఆడవాళ్ల వెనుకపడి, కెరీర్, లైఫ్ ని పోగొట్టుకున్న క్రికెటర్లను చూసి నేర్చుకోమని అంటున్నారు. మరికొందరైతే ఇలాగేనా ఆడపిల్లలతో వ్యవహరించేది? అని ప్రశ్నిస్తున్నారు. నువ్విలాగే ప్లే బాయ్ లా వెళితే, ఆట నాశనమైపోతుంది జాగ్రత్త అంటున్నారు.  ఇప్పటికే సగం పోయింది. ఇంక మొత్తం పోతుందని శాపనార్థాలు పెడుతున్నారు.

సారా టెండుల్కర్, గిల్ ఇద్దరూ పలు పార్టీల్లో కనిపించారు, సన్నిహితంగా కలిసి మెలసి చాలాకాలం తిరిగారు. అంతేకాకుండా గిల్ సోదరితో కలిసి సారా టెండూల్కర్ లేట్ నైట్ పార్టీలకు హాజరవడం కూడా దుమారం రేపింది. వీరిద్దరి విషయంలో రెండు కుటుంబాలు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు చిన్నోడు.. మరో చిన్నదానితో తిరుగుతున్నాడు. మరి సారా కంప్లీట్ గా వదిలేసినట్టేనా? లేదా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×