Jadeja Wife: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఈసారి టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ రెడీ ఏకంగా ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేవలం రెండంటే రెండు మ్యాచ్లోనే విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ ( CSK). ఈ దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డును… లిఖించుకుంది.
Also Read: Nitish Kumar Reddy : కొడుకు SRH… తండ్రి RCB… ఫ్యాన్స్ ను పిచ్చోళ్ళు చేస్తున్నారు కదరా
జడేజా భార్య ఎమోషనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings team ) ఎలిమినేట్ కావడంతో… ఆ జట్టు అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రౌండ్లోనే ఏడ్చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా భార్య రివాభ జడేజా ( Ravindra Jadeja’s wife Rivabha Jadeja ) కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలా మొట్టమొదటిసారిగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి జట్టుగా ఎలిమినేట్ కావడంపై.. జడేజా భార్య బిజెపి ఎమ్మెల్యే రివాభ జడేజా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎమోషనల్ అయిన ఫోటోలను కొంతమంది.. ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.
జడేజా భార్య హాట్ హాట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉందని… ఆమె ఫోటోలను ఎడిట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలిమినేట్ అయితే ఆమె రొమాంటిక్గా చూస్తోందని.. ఆమె ఫోటోలను ఎడిట్ చేసి వైరల్ చేశారు. అయితే దీనిపై జడేజా అభిమానులు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు చేస్తున్న పని అని.. మండిపడుతున్నారు.
Also Read: Vaibhav Suryavanshi : ఒరేయ్… రియాన్ పరాగ్ కొడుకే వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్
చెన్నై పై రాయల్ చాలెంజర్స్ ట్రోలింగ్
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య.. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వివాదాలు ఉంటాయి. ఒక కప్పు గెలవలేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై అభిమానులు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని చెన్నై సూపర్ కింగ్స్ 5 టోర్నమెంట్లు గెలిచిందని ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోతున్నారు. మహేంద్ర సింగ్ ధోని పరువు తో పాటు చెన్నై అభిమానుల పరువు కూడా తీసి.. ట్రోలింగ్ చేస్తున్నారు.