BigTV English

Vijay Sethupathi: విజయ్ – నిత్యా మీనన్ సినిమా టైటిల్ టీజర్ ..

Vijay Sethupathi: విజయ్ – నిత్యా మీనన్ సినిమా టైటిల్ టీజర్ ..

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా పాండీరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇది విజయ్ సేతుపతి 52వ సినిమా. సత్య జ్యోతి ఫిల్మ్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సెంబియన్ వినోద్, సురేష్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ 2022లో విడుదలైన మలయాళం చిత్రం 19(1)a లో నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో మంచి అంచనాలే నెలకొన్నాయి.. తాజాగా ఈరోజు చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ‘తలైవా తలైవి’ ని ప్రకటించి, టైటిల్ టీజర్ ను విడుదల చేసింది.. ఆ వివరాలు చూద్దాం…


ఈ మూవీలో హీరో వంటవాడు …

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ న్యాచురాల్టికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా తన నటనతో ఆయన ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు.. ఇక నిత్యామీనన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తమిళంలో తిరు సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఈ భామ మరోసారి తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్ గా కనిపిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.


ఇక టీజర్ లో నిత్యామీనన్, విజయ్ సేతుపతి కలిసి వంటను ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ భార్యాభర్తలు గా మనకి కనిపిస్తారు. నిత్యామీనన్తో విజయ్ గొడవపడడం, నిత్య పెద్దగా అరవడంతో.. చేసేదేం లేక విజయ్ తన నోటికి టవల్ ని కట్టుకొని ఏమీ మాట్లాడకుండా పని చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ నిత్యామీనన్ డామినేషన్, గయ్యాళి భార్య పాత్రలో మనకి కనిపిస్తుంది. చివరిలో విజయ్ గన్ తీసుకొని ఎవరినో షూట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. అక్కడితో టీజర్ ఎండ్ అవుతుంది. ఈ చిత్రం టైటిల్ తలైవా తలైవి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఫ్యాన్స్ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

నిత్యా మూవీస్ …మూవీస్ ..

ఇక నిత్యామీనన్ ఇష్క్ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. జనతా గ్యారేజ్, ఆ!, భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు. తమిళంలో తిరుచిత్రబలం మూవీలో ధనుష్ తో నటించింది. ఈ సినిమా తమిళం, తెలుగులోనూ మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వండర్ విమెన్, కొలంబి, రాయన్ వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు విజయ్ సేతుపతితో తమిళంలో ఈ మూవీతో మన ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ తో మరో మూవీని చేస్తున్నట్లు సమాచారం. గత సంవత్సరం మహారాజ తో మన ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి ఈ సంవత్సరం నిత్యామీనన్ తో రానున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని సంతోష్ నారాయణ అందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×