BigTV English

Jasprit Bumrah: ఏమని వర్ణించను.. నచ్చిన కెప్టెన్లపై బుమ్రా

Jasprit Bumrah: ఏమని వర్ణించను.. నచ్చిన కెప్టెన్లపై బుమ్రా

Jasprit Bumrah Reveals Who His Favourite Captain Is Virat, Rohit or Dhoni: టీమ్ ఇండియా తురుపు ముక్కగా పేరుపొందిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎక్కువగా నోరు తెరిచి మాట్లాడాడు. భావోద్వేగాలను తనలోనే దాచుకుంటాడు. కెప్టెన్ కావాలనే తన ఆశను అప్పుడప్పుడు వ్యక్తీకరిస్తుంటాడు. అది కూడా ముంబయి జట్టుకి పాండ్యాని కెప్టెన్ ని ఎంపిక చేసినప్పుడు, తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది నెట్టింట బాగా వేడి పుట్టించింది.


ప్రస్తుతం తను మళ్లీ కెప్టెన్సీపై పెదవి విప్పాడు. అయితే అది కూడా చెప్పీ చెప్పకుండా అతి తెలివిగా చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మీ కెరీర్ లో మీకు నచ్చిన కెప్టెన్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు తను వెరైటీగా సమాధానం చెప్పాడు. అదేమిటంటే.. నాకు ఎవరూ ఇష్టం లేదు. నేను కెప్టెన్ అయితే, నాకు నేనే పెద్ద ఫ్యాన్  అని అన్నాడు.

అలా అంటూనే తన కెరీర్ లో తనకెదురైన ముగ్గురు ప్రముఖ కెప్టెన్లపై అభిప్రాయాన్ని చెప్పాడు.  తొలిగురువు అయిన ధోనీ గురించి మాట్లాడాడు. తన హయాంలోనే క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. ధోనీకి పెద్దగా ప్లానింగ్ ఉండదు. ఇలా ఆడాలి, అలా ఆడాలని గ్రౌండులోకి రాడు. ఆట జరిగేటప్పుడు పరిస్థితులకి తగినట్టుగా ప్లాన్ చేస్తాడు. వాటికి తిరుగుండదు. తను ప్లాన్ చేస్తే గన్ షాట్ గా తగలాల్సిందేనని అన్నాడు. అందుకు  తను ఆ టైమ్ లో కుర్రాళ్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాడు.  విఫలమవుతున్నా పలు అవకాశాలిస్తాడు. ఇంతదూరం వచ్చారంటే, వారిలో ఏదో విషయం ఉంది, అది వెలుగులోకి తేవడమే కెప్టెన్ గా నాపని అని అంటాడు. అలా ఆటగాళ్లకు భద్రత కల్పించడంలో తనే ముందుంటాడని తెలిపాడు.


ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. మైదానంలో దూకుడైన కెప్టెన్. ఆటపై, దేశంపై కొహ్లీకి ఉన్న నిబద్ధత చాలా గొప్పది. అతన్ని చూసినప్పుడల్లా ఇన్సిపిరేషన్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ నిరాశగా కనిపించడు. అంత ఎనర్జటిక్ గా ఉంటాడు.  ఫిట్‌నెస్‌ విషయంలో కోహ్లీనే మాకు ఆదర్శం. తనిప్పుడు కెప్టెన్ కాకపోవచ్చు, కానీ ఎప్పటికి తనే… మా నిజమైన నాయకుడని మనసులో మాట తెలిపాడు.

Also Read:  రెండో టెస్టులో విండీస్ చిత్తు..సౌతాఫ్రికాదే సిరీస్

రోహిత్ శర్మ గురించి చెబుతూ.. తను ఓ మంచి కెప్టెన్ అని అన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుల మంచీ చెడులు తెలుసుకుంటాడు. సానుభూతి వ్యక్తం చేస్తాడు. వారి కష్టంలో ఆదుకుంటాడు. తనూ బాధపడతాడు. కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలని పదే పదే చెబుతుంటాడు.

గేమ్ లో ఉన్నప్పుడు..ఎవరైనా బౌలింగులో క్యాచ్ డ్రాప్ చేస్తే, నాకెంతో బాధ కలుగుతుంది. నాకన్నా కెప్టెన్ కి ఎక్కువ బాధ ఉంటుంది. అందుకే రోహిత్ సీరియస్ అవుతాడు. అది అందరూ అర్థం చేసుకుంటారని అన్నాడు.

ఇలా తన కెరీర్ లో అత్యంత విలువైన ముగ్గురు కెప్టెన్లతో ఆడటం వల్ల, వారి సూచనలతో బౌలర్ గా మరింత రాణించానని తెలిపాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×