Jofra Archer: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ లో ( Trent Bridge, Nottingham) ఇప్పటికే రెండు మ్యాచ్ లలో టీమిండియా ఓడిపోయింది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దుకాగా, రెండు, మూడో మ్యాచ్ లలో ఇండియా చిత్తుగా ఓడిపోయింది. నిన్న నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 100 లోపే ఆల్ అవుట్ అయిన టీమిండియా.. ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పిచ్ లకు అలవాటు పడ్డారు..ఇంగ్లండ్ లో టీమిండియా ఆటలు సాగవు అంటూ పరువు తీశారు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer). చిన్న బౌండరీలు ఉంటేనే ఆడతారంటూ హేళన చేశారు. దీంతో జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మూడో టి20 లో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ మైదానాలకు అలవాటు పడ్డారని బాంబు పేల్చారు. అందుకే తమ ఇంగ్లాండు మైదానాలలో ఆడేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ టోర్నమెంట్ తాను ఆడాను కాబట్టి… వాళ్ల వీక్నెస్ లు మొత్తం తనకు అర్థమయ్యాయి అని పేర్కొన్నారు. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ లు ఉంటేనే టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా రానించి… సెంచరీల మీద సెంచరీలు కొడతారని హేళన చేశారు. విదేశీ మైదానాలలో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని… ఐర్లాండ్ లో కూడా అదే జరిగిందన్నారు. అందుకే తమ ఫార్ములాను అద్భుతంగా అప్లై చేసి… టీమిండియాను ఓడించామన్నారు. ఇక వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ తరఫున ఆడినప్పుడు ప్రాక్టీస్ సమయంలో తానే బౌలింగ్ చేసే వాడిని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అతడి నెగిటివ్ పాయింట్స్ మొత్తం గ్రహించి.. నిన్న బౌలింగ్ చేశానని తెలిపారు. అందుకే వైభవ్ త్వరగా అవుట్ అయ్యాడని గుర్తు చేశారు.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్న మూడవ టి20 జరిగింది. ఇందులో 125 పరుగుల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ మూడు ఓవర్లు వేసి 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు ఆర్చర్. ముందుగా వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగొట్టిన ఆర్చర్, ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను పెవీలియన్ కు పంపించాడు. ఇక చివరగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో టీమిండియా కోలుకోకుండా అయింది. అంటే టీమిండియా ఓటమికి జోఫ్రా ఆర్చర్ కారణం అయ్యాడు.