E-Paper
Advertisement

వరుస మర్డర్స్ తో వణికిపోయే ఊరు… వర్త్ వాచింగ్ థ్రిల్లర్ మావా

వరుస మర్డర్స్ తో వణికిపోయే ఊరు… వర్త్ వాచింగ్ థ్రిల్లర్ మావా
Advertisement

Mystery Thriller Series: థ్రిల్లర్ సినిమాలు అంటే ఎలా ఉండాలి ? నిమిషానికో ఊహించని ట్విస్ట్ తో, గూస్ బంప్స్ తెప్పించే మలుపుతో, ఒక్కసారి చూస్తే మళ్ళీ మరిచిపోలేని సీన్స్ తో… కెవ్వు కేక అనిపించాలి. ఇక దానికి సూపర్ నేచురల్ పవర్స్ యాడ్ అయితే ఆ కిక్కే వేరప్పా. మీకు కూడా అలాంటి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ను ఓటీటీలో చూడాలని కోరికగా ఉందా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. 2017లో విడుదలై ఫ్రెంచ్-బెల్జియన్ వెబ్ సిరీస్‌లో సంచలనం సృష్టించిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లాక్ స్పాట్’ (Black Spot / Zone Blanche). మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ బెల్జియం సరిహద్దులో ఉన్న ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ జరిగే వింత వింత హత్యలు, అడవి రహస్యాలు, ఒక ధైర్యవంతురాలైన డిటెక్టివ్ భయంకరమైన పోరాటం ఈ సిరీస్‌ ను ఉత్కంఠభరితంగా చేస్తాయి. స్టోరీలోకి వెళ్తే… విల్లేఫ్రాంచె అనే చిన్న గ్రామం చుట్టూ 50,000 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన అడవి ఉంటుంది. లోపలి వెళ్తే కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా పని చేయవు. ఈ గ్రామంలో దేశంలోని సగటు కంటే ఆరు రెట్లు ఎక్కువ హత్యలు, ఘోరాలు జరుగుతుంటాయి.

Advertisement

లారెన్ వీస్ అనే లోకల్ పోలీస్ చీఫ్ ఈ నేరాలను విచారిస్తుంటుంది. ఆమెకు కూడా ఒక గతం ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఆ అడవిలో ఎవరో ఆమెను కిడ్నాప్ చేసి, ఒక చెట్టుకు కట్టేసి ఆమె రెండు వేళ్లను నరికేస్తారు. ఆ సంఘటన ఆమెకు అస్సలు గుర్తుండదు. ఈ బాధను మరచిపోయి పోలీస్ డ్యూటీలో మునిగిపోయి ఉంటుంది. గ్రామంలో జరుగుతున్న వరుస హత్యల వెనుక అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ‘ఫ్రాంక్ సిరియాని’ అనే వింతైన ప్రవర్తన గల ఒక కొత్త ప్రాసిక్యూటర్ అక్కడికి వస్తాడు.

లారెన్, ఫ్రాంక్ ఇద్దరూ కలిసి కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ, వారికి ఆ ఊరి మేయర్ కుటుంబానికి, అడవికి ఉన్న వింత సంబంధాల గురించి తెలుస్తుంది. ఆ అడవి కేవలం చెట్లతో కూడినది కాదని, దానికి ఒక స్వంత దైవిక లేదా రాక్షస శక్తి ఉందని, అది మనుషులను తన వైపుకు లాక్కుంటుందని తెలుసుకుంటారు. గ్రామంలో జరుగుతున్న హత్యల వెనుక ఈ శక్తి ఉందని అర్థమవుతుంది. మరి లారెన్ రెండు వేళ్లను నరికిన ఆ వింత శక్తి ఏంటి ? గ్రామంలో మాయమవుతున్న అమ్మాయిల వెనుక ఉన్న రహస్యం ఏంటి ? చివరికి ఆ అడవి శక్తుల నుండి వీరు ఎలా బయటపడ్డారు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

తెలుగు స్ట్రీమింగ్ ?

Advertisement

సిరీస్ మొత్తం 2 సీజన్లు కాగా, 16 ఎపిసోడ్ల ఉత్కంఠభరితమైన కథ ఇది.ఈ సిరీస్ సూపర్ నేచురల్ హారర్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అంశాలతో అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు. ప్రస్తుతం Netflixలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు.

Read Also: చేతబడి పేరుతో అమ్మాయి వశీకరణ… అనన్య పాండేను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు

Tags

Related News

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Big Stories

Advertisement
×