E-Paper
Advertisement

గంభీర్ కు నిర‌స‌న సెగ‌..టీమిండియా బ‌స్సు క‌ద‌ల‌కుండా అడ్డుకున్న ఫ్యాన్స్‌

గంభీర్ కు నిర‌స‌న సెగ‌..టీమిండియా బ‌స్సు క‌ద‌ల‌కుండా అడ్డుకున్న ఫ్యాన్స్‌
Advertisement

Samson Fans On Gambhir:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India ) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో మనోళ్లు చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటికే రెండో టీ20 లో ఓడిపోయిన టీమ్ ఇండియా… నిన్న నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా జరిగిన మూడవ టి20 లో కూడా చిత్తుగా ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ క్రికెటర్లు 200 పరుగులకు పైగా టార్గెట్ పెడితే.. టీమిండియా మాత్రం 100 లోపే ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhir) ఇంగ్లాండ్ లో నిరసన సెగ తగిలింది. సంజు శాంసన్ (sanju samson) అభిమానులు టీమిండియా బస్సు ముందుకు వచ్చి నిరసనకు దిగారు. బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. We want Sanju అనే నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

గంభీర్ కు నిర‌స‌న సెగ‌..బ‌స్సు క‌ద‌ల‌కుండా అడ్డుకున్న ఫ్యాన్స్‌

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో సంజు శాంసన్ ను గౌతమ్ గంభీర్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. రెండో టి20లో సంజు శాంసన్ ను కాదని 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సంజు శాంసన్ స్థానంలో వచ్చిన వైభవ్ సూర్యవంశీ, రెండో టి20 తో పాటు నిన్న జరిగిన మూడవ మ్యాచ్ లో కూడా విఫలం అయ్యాడు. ఈ క్రమంలో వెంటనే సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అనవసరంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ను తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా మ్యాచ్ పూర్తయిన తర్వాత గౌతమ్ గంభీర్, టీమిండియా ప్లేయర్లు స్టేడియం నుంచి హోటల్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా టీమిండియా బస్సు దగ్గర గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంజు శాంసన్ అభిమానులు. We want Sanju అంటూ రెచ్చిపోయారు. బస్సులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ అలర్ట్ అయి, వాళ్లను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే సంజు అభిమానులు తీరుపై గౌత‌మ్ గంభీర్ గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇంగ్లాండ్ తో జ‌రిగే నాలుగో టీ20 మ్యాచ్ లో సంజు శాంస‌న్ ను ఆడిస్తార‌ని స‌మాచారం.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

 

Related News

ఐపీఎల్ పిచ్ ల‌కు అల‌వాటు ప‌డ్డారు..ఇంగ్లండ్ లో టీమిండియా ఆట‌లు సాగ‌వు

టీమిండియాను ఒక్క టైటిల్ గెల‌వ‌లేని పంజాబ్ కింగ్స్ లా మార్చుతున్నారు..శ్రేయ‌స్ పై ఫైర్‌

30 రోజుల ముందే ఛాలెంజ్ విసిరాడు..ఇప్పుడు వైభ‌వ్ వికెట్ తీశాడు, ఆర్చర్ మామూలోడు కాదురా

టీమిండియా కోచ్ గా ల‌క్ష్మ‌ణ్‌..తెలివిగా త‌ప్పించుకుంటున్నాడ‌ని గంభీర్ పై ట్రోల్స్‌

ఓరి మీ దుంపలు తెగ..టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?

ఇంగ్లండ్ లేడీ క్రికెట‌ర్ హ‌గ్ ఇవ్వ‌లేద‌ని అలిగిన జై షా ?

మ‌హిళ‌ల క్రికెట‌ర్ల‌పై డ‌బ్బులు పెట్ట‌డం దండ‌గ‌..ఆ జ‌ట్టును ర‌ద్దు చేయండి ?

Big Stories

Advertisement
×