E-Paper
Advertisement

ఓరి మీ దుంపలు తెగ..టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?

ఓరి మీ దుంపలు తెగ..టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?
Advertisement

Team India:  టీమిండియా జట్టులో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత ఫుల్ బిజీగా మారింది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్, ఈనెల చివరలో జింబాబ్వేతో వరుసగా సిరీస్ లు ఆడుకుంటూ ముందుకు సాగనుంది. అయితే ఈ క్రమంలో టీమిండియా జట్టులోకి కేవలం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు మాత్రమే వస్తున్నట్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో టెస్టులతో పాటు వన్డేలు జరిగినప్పుడు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు మాత్రమే దర్శనమిస్తున్నారు.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?

Advertisement

టెస్టులతో పాటు వన్డేలు టీమిండియా ఆడినప్పుడు కెప్టెన్ గా గిల్ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కూడా గిల్ కొనసాగాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేలు మొన్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సందర్భంగా జరిగాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మాత్రమే జట్టులో దర్శనమిచ్చారు. గిల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ సుతార్ టీమిండియాలోకి వచ్చి.. ఇతర స్థానాలను కబ్జా చేశారు. ఈ క్రమంలో గిల్ పైన దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు టి20లతో టీం ఇండియా బిజీగా మారింది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు టీమిండియాలో దర్శనమిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే జింబాబ్వేతో జరిగే టి20 సిరీస్ కోసం తాజాగా టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. ఈ సందర్భంగా సంజు శాంసన్ కు నిరాశ ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని తీసుకున్నారు. అదే సమయంలో ప్రబ్ సిమ్రాన్ సింగ్, సూర్యాన్ష్ షెగ్డే, యష్ ఠాకూర్ లాంటి ముగ్గురు కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో టీమిండియాలోకి పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు వచ్చేస్తున్నారని మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. వన్డేలు, టెస్టులు గుజరాత్ ప్లేయర్లకు అప్పగిస్తే… టి20 లు మాత్రం పంజాబ్ ఆటగాళ్లకు విచ్చేస్తున్నట్లు ట్రోల్స్ చేస్తున్నారు.

RCB ప్లేయర్లకు నో ఛాన్స్

Advertisement

గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు మాత్రం ఇవ్వడం లేదు. భువనేశ్వర్ కుమార్, రసిక్ దార్, రజత్ పాటిదార్, లాంటి బెంగుళూరు ఆటగాళ్లకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. అటు మహమ్మద్ షమీని పట్టించుకునే నాధుడే లేడు. దీంతో గంభీర్, అజిత్ అగార్కర్ లాంటి వాళ్లను తొలగించి… మహేంద్ర సింగ్ ధోనీకి పూర్తి బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్పుడే టాలెంట్ ఉన్నవాళ్ళకు అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

 

Related News

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ త‌న్వీర్ సీరియ‌స్‌

పాకిస్తాన్ జ‌ట్టును చూస్తే అస‌హ్యం వేస్తోంది..మీ కంటే, ఉగాండా బెట‌ర్‌

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..DKపై త‌న్వీర్ ఫైర్‌

నాకు కెప్టెన్సీ ఇవ్వండి..లేకపోతే వేలంలో వదిలేయండి.. CSKకు సంజు వార్నింగ్ ?

40 కోట్ల టాకాల న‌ష్టం…బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ర‌ద్దు

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్

Big Stories

Advertisement
×