Jay Shah- Lauren Bell : టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం రోజున ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల (England Women vs Australia Women, Final) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఏడవ సారి టైటిల్ కూడా గెలుచుకుంది. దీంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఐసీసీ బాస్ జై షా (Jay Shah)… ఆస్ట్రేలియా కెప్టెన్ కు టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇతర అవార్డులు కూడా అందించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లేడీ ప్లేయర్ లారెన్ బెల్ ( Lauren Bell), జై షా మధ్య జరిగిన సంఘటన వైరల్ గా మారింది.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) ఫైనల్ ముగిసిన తర్వాత… ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీసీ బాస్ జై షాకు ఇంగ్లాండ్ ప్లేయర్ లారెన్ బెల్ ( Lauren Bell) షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత జై షా పక్కన ఉన్న మరో ఇంగ్లాండ్ వ్యక్తికి మాత్రం హగ్గుతో పాటు కిస్ కూడా ఇచ్చింది లారెన్ బెల్. ఈ నేపథ్యంలో బిత్తర పోయిన జై షా… వాళ్లను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అదేంటి నాకు ఇవ్వని హగ్గు, కిస్సులు… వాడికొక్కడికే ఇచ్చిందేంటి ? అంటూ లారెన్ బెల్ ను జై షా కళ్ళు తెరిచి చూస్తూ అలా ఉండిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్… రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం జై షా కు కూడా హగ్గో ?లేదా కిస్సో ? ఇస్తే సరిపోవు కదా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే… ఐసీసీ బాస్ జై షా ఇంత కామాంధుడా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంగ్లండ్ లేడీ క్రికెటర్ లారెన్ బెల్ హగ్ ఇవ్వలేదని జై షా అలిగాడంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో మొదట ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 150 పరుగులు సాధించింది ఇంగ్లాండు. అయితే ఆ లక్ష్యాన్ని 17.1 ఓవర్స్ లో చేదించి, చాంపియన్ అయింది ఆస్ట్రేలియా.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==