E-Paper
Advertisement

టీమిండియాను ఒక్క టైటిల్ గెల‌వ‌లేని పంజాబ్ కింగ్స్ లా మార్చుతున్నారు..శ్రేయ‌స్ పై ఫైర్‌

టీమిండియాను ఒక్క టైటిల్ గెల‌వ‌లేని పంజాబ్ కింగ్స్ లా మార్చుతున్నారు..శ్రేయ‌స్ పై ఫైర్‌
Advertisement

Virender Sehwag:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ (India tour of England, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో వరుసగా టీమిండియా ఓటమిపాలవుతోంది. ఇలాంటి క్రమంలో నిన్న ఈ రెండు జట్ల మధ్య నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా మూడవ టి20 జరిగింది. ఇందులో కూడా శ్రేయస్ అయ్యర్ ( Shreyas iyer) సేన అత్యంత ధారణ ప్రదర్శన కనబరిచి ఓటమిపాలైంది. 76 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చాలా సీరియస్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత… ఒక్క టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ తరహాలో టీమిండియా తయారవుతోందని బాంబు పేల్చారు. గతంలోని ఈ విషయాన్ని తాను చెప్పానని.. ఇప్పుడు అదే రుజువు అవుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడో టి20 లో ఒక్కటంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదని.. మండిపడ్డారు. చేతకాకపోతే ఇంగ్లాండ్ వదిలి, ఇండియాకు రావాలంటూ చురకలు అంటించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

టీమిండియాను పంజాబ్ కింగ్స్ లా మార్చుతున్నారు

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో మూడవ టి20 లో కూడా టీమిండియా ఓడిపోయిన క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత… జట్టును పంజాబ్ కింగ్స్ తరహాలో తయారు చేస్తున్నాడని సెటైర్లు పేల్చారు. అందుకే టీమిండియా వరుసగా ఓటమి పాలవుతోందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు వివరించారు. సూర్య కుమార్ యాదవ్ తప్పకుండా తర్వాత టీమిండియా దిగజారుతోందని ఫైర్ అయ్యారు. నిన్న ఇంగ్లాండ్ అవలీలగా 200 పరుగులు చేస్తే… మనోళ్లు 100 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసారని నిప్పులు చెరిగారు.

టీమిండియా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆగ్రహించారు. వైభవ్ సూర్య వంశీ ఏదో పికుతాడని అనుకుంటే… విఫలమవుతున్నాడని మండిపడ్డారు. వెంటనే సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన రెండు టీ20 లలో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే వైట్ వాష్ తప్పదని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా నిన్న నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 201 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 11.4 ఓవర్లలో 76 పరుగుల వద్ద అలౌట్ అయింది ఇండియా.

Advertisement

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

 

 

Related News

గంభీర్ కు నిర‌స‌న సెగ‌..టీమిండియా బ‌స్సు క‌ద‌ల‌కుండా అడ్డుకున్న ఫ్యాన్స్‌

30 రోజుల ముందే ఛాలెంజ్ విసిరాడు..ఇప్పుడు వైభ‌వ్ వికెట్ తీశాడు, ఆర్చర్ మామూలోడు కాదురా

టీమిండియా కోచ్ గా ల‌క్ష్మ‌ణ్‌..తెలివిగా త‌ప్పించుకుంటున్నాడ‌ని గంభీర్ పై ట్రోల్స్‌

ఓరి మీ దుంపలు తెగ..టీమిండియాలో పంజాబ్, గుజ‌రాత్ ప్లేయ‌ర్లే ఉన్నారు క‌ద‌రా ?

ఇంగ్లండ్ లేడీ క్రికెట‌ర్ హ‌గ్ ఇవ్వ‌లేద‌ని అలిగిన జై షా ?

మ‌హిళ‌ల క్రికెట‌ర్ల‌పై డ‌బ్బులు పెట్ట‌డం దండ‌గ‌..ఆ జ‌ట్టును ర‌ద్దు చేయండి ?

Babar Azam: కోహ్లీ పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్‌, సొంత‌ రికార్డుల కోసమే సెంచ‌రీలు చేస్తాడు

Big Stories

Advertisement
×