E-Paper
Advertisement

PBKS-Josh Inglis: పెళ్లి, హ‌నీమూన్ అంటూ డ్రామాలు..ప్రీతీ జింటాను మోసం చేసిన జోష్ ఇంగ్లిస్

PBKS-Josh Inglis: పెళ్లి, హ‌నీమూన్ అంటూ డ్రామాలు..ప్రీతీ జింటాను మోసం చేసిన జోష్ ఇంగ్లిస్
Advertisement

PBKS-Josh Inglis: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం మొన్న డిసెంబర్ 16వ తేదీన పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మినీ వేలం పంజాబ్ కింగ్స్ కొంప ముంచినట్లు తెలుస్తోంది. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోష్ ఇంగ్లీస్‌, చివరి క్షణంలో వేలంలోకి వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టును దెబ్బ తీశాడు. పెళ్లి అలాగే హనీమూన్ అంటూ ముందు డ్రామాలు ఆడి, పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి బయటకు వచ్చాడు. చివరి క్షణంలో ఐపీఎల్ వేలానికి తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంకేముంది వేలంలోకి రాగానే జోష్ ఇంగ్లీస్‌ ను లక్నో సూపర్ జెయిట్స్ రూ. 8.6 కోట్లకు దక్కించుకుంది. ముందుగా నాలుగు మ్యాచ్ లు ఆడతానని చెప్పిన జోష్ ఇంగ్లీస్‌, ఇప్పుడు హనీమూన్ క్యాన్సల్ చేసుకొని మరీ, పూర్తిస్థాయిలో ఉంటానని పేర్కొన్నాడట. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ తీవ్ర అగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

ప్రీతి జింటాను నట్టేట ముంచిన జోష్ ఇంగ్లీస్‌

Advertisement

ఐపీఎల్ 2025 సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున బరిలోకి దిగాడు జోష్ ఇంగ్లీస్‌. ఆస్ట్రేలియాకు చెందిన ఈ తోపు ప్లేయర్, పంజాబ్ కింగ్స్ జట్టును గత సీజన్ లో ఫైనల్ వరకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాడు. జట్టుకు వాల్యుబుల్ ప్లేయర్ గా మారాడు జోష్ ఇంగ్లీస్‌. అలాంటి ప్లేయర్ ను పంజాబ్ కింగ్స్ అస్సలు వదులుకోమని ముందుగా నిర్ణయం తీసుకుంది. కానీ 2026 సంవత్సరంలో తన పెళ్లి ఉందని, ఐపీఎల్ 2026 కేవ‌లం 4 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌తాన‌ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి జోష్ ఇంగ్లీస్‌ సమాచారం ఇచ్చాడు. దీంతో జోష్ ఇంగ్లీస్‌ ను మొన్నటి రిటెన్షన్ సమయంలో రిలీజ్ చేసింది పంజాబ్ కింగ్స్. అయితే ఐపీఎల్ మినీ వేలం 2026 రాగానే మళ్లీ రిజిస్టర్ చేసుకున్నాడు జోష్ ఇంగ్లీస్‌. ఇక వేలంలోకి వచ్చిన జోష్ ఇంగ్లీస్‌ ను తెలివిగా 8.60 కోట్లకు లక్నో దక్కించుకుంది. అయితే 2025 సమయంలో 2.60 కోట్లకే పంజాబ్ కింగ్స్ జోష్ ఇంగ్లీష్ ను దక్కించుకుంది. అయితే వేలంలోకి వస్తే ఎక్కువ ధర వస్తుందని, పెళ్లి పేరుతో జోష్ ఇంగ్లీస్‌ డ్రామాలు ఆడినట్లు తెలుస్తోంది. అయితే వేలంలో రూ.8.60 కోట్లు రాగానే, పెళ్లి చేసుకొని హనీమూన్ వాయిదా వేసుకోవాలని అనుకుంటున్నాడట జోష్ ఇంగ్లీస్‌. ఏప్రిల్ 18వ తేదీన అంటే ఐపిఎల్ ప్రారంభమైన తర్వాత పెళ్లి కోసం, ఆస్ట్రేలియా వెళ్తానని లక్నోకు సమాచారం ఇచ్చాడట.

హ‌నీమూన్ క్యాన్సిల్ చేసుకున్న జోష్ ఇంగ్లీస్ ?

పెళ్లి జరిగిన వెంటనే హనీమూన్ చేసుకోకుండా ఇండియాకు వస్తానని స్పష్టం చేశాడట. ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ పూర్తి స్థాయిలో ఆడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు. రూ.8.60 కోట్లు రాగానే ఈ నిర్ణయం తీసుకున్నాడట జోష్ ఇంగ్లీస్‌. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టుకు జోష్ ఇంగ్లీస్‌ వెన్నుపోటు పొడిచాడని ఫైర్ అవుతున్నారు. అటు బీసీసీఐపై కూడా పంజాబ్ కింగ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. డబ్బులు ఎక్కువ కావాలని తమకు చెబితే జోష్ ఇంగ్లీస్‌ కు డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళం కదా అంటూ పంజాబ్ కింగ్స్ పేర్కొంటోందట. జోష్ ఇంగ్లీస్‌ అలాగే బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఈ పెను తప్పిదం జరిగినట్లు చెబుతున్నారు. మొత్తానికి జోష్ ఇంగ్లీస్‌ ను పంజాబ్ కింగ్స్ కోల్పోవడం పెద్ద నష్టమే అని చెప్పవచ్చు.

Advertisement

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×