Karun Nair: ఫిబ్రవరి 19వ తేదీ నుండి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే దేశాల క్రికెట్ బోర్డులు తమ తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి. కానీ భారత జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తుంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని సెంటర్లు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంజెక్షన్లు తీసుకుంటున్న కోహ్లీ !
ఇటీవల భారత సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో విఫలం కావడంతో ప్రస్తుతం భారత జట్టు ఎంపిక చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2024 – 25 లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసం కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్ లు ఆడిన కరుణ్ నాయర్.. బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడుతున్నాడు. ఇప్పటివరకు కరుణ్ ఆడిన ఏడు ఇన్నింగ్స్ లలో రికార్డు స్థాయిలో 75.2 సగటుతో 752 పరుగులు చేశాడు. ఈ ఏడు ఇన్నింగ్స్ లలో (112*), (44*) (163*), (111*), (112*), (122*), (88*). ఈ ఏడు ఇన్నింగ్స్ లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఔట్ అయ్యాడు.
ఈ ఏడు ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు, ఓ ఆఫ్ సెంచరీ ఉన్నాయి. మహారాష్ట్రతో జరిగిన రెండవ సెమీఫైనల్ లో కూడా కరుణ్ 44 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇతర ఆటగాళ్లు దృవ్ షోరే, యష్ రాథోడ్ సెంచరీలతో దుమ్మురేపడంతో విదర్భ జట్టు విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్ కి దూసుకువెళ్లింది.
శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో విదర్భ.. కర్ణాటకతో పోటీ పడనుంది. అయితే కరుణ్ నాయర్ ని ఔట్ చేయలేకపోతున్నారు ప్రత్యర్థి బౌలర్లు. ప్రతి ఇన్నింగ్స్ లోను అతడిదే ఆధిపత్యం కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్ లో టి-20 ఆటతో చెలరేగుతున్నాడు. కేవలం ఈ మధ్య మాత్రమే కాదు.. గత కొన్ని నెలలుగా కరుణ్ ఇదే జోరు కొనసాగిస్తున్నాడు. కర్ణాటక మహారాజా టీ-20 ట్రోఫీలో కూడా 12 మ్యాచ్ లలో 560 పరుగులు చేశాడు. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో కూడా అదరగొట్టాడు.
Also Read: TATA WPL 2025 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కరుణ్ కి అవకాశం ఇస్తే తప్పేంటని విశ్లేషకుల మాట. భీకర ఫామ్ లో ఉన్న కరుణ్ లాయర్ లాంటి బ్యాటర్లను ఓసారి పరీక్షించాలని విశ్లేషకులు అంటున్నారు. 8 సంవత్సరాల క్రితం భారత క్రికెట్ లో కరుణ్.. ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ సాధించాడని.. అతడికి అవకాశం ఇస్తే ఇంగ్లాండ్ పై రాణిస్తాడని అంటున్నారు. మరికొందరు మాత్రం అతడు 33 సంవత్సరాలు వయసు ఉన్నాడని.. వయసు రిత్యా టెస్టుల్లో రాణించలేడని కామెంట్స్ చేస్తున్నారు. మరి సెలెక్టర్లు కరుణ్ పై దృష్టి పెడతారా..? లేదా..? అన్నది వేచి చూడాలి.