Indian Railway Tickets Booking: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, భారతీయ జీవనాడిగా పిలువబడుతుంది. ప్రతి రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. చౌక ధరలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. గతంలో టికెట్లు బుక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్లలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ, డిజిటల్ విప్లవం కారణంగా టికెట్ల బుకింగ్ మరింత ఈజీ అయ్యింది. ప్రయాణీకులు ఇళ్ల దగ్గర ఉండే ఆన్ లైన్ లోటికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే, తక్కువ ధరకు రైల్వే టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అందుబాటులో బోలెడు టికెట్ బుకింగ్ యాప్స్
ప్రస్తుతం రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి పలు ఆన్ లైన్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది ఈ యాప్స్ ద్వారానే టికెట్లు ఈజీగా బుక్ చేసుకుంటున్నారు. అయితే.. ప్రైవేట్ యాప్స్ ఉపయోగించడం వల్ల కన్వీనియన్స్ ఛార్జ్, ఏజెంట్ సర్వీస్ ఛార్జ్, పేమెంట్ గెట్ వే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ చెల్లించడం ద్వారా టికెట్ ధర మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
IRCTCతో ఈజీగా, చౌకగా టికెట్ బుకింగ్
రైలు టికెట్లను తక్కువ ధరలో పొందాలంటే ఒకే ఒక్క మార్గం.. భారతీయ రైల్వే అధికారిక టికెట్ బుకింగ్ IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్ సైట్ లేదంటే యాప్. IRCTC టికెట్ బుకింగ్ కోసం అదనపు ఛార్జీలు విధించదు. ప్రైవేట్ యాప్స్ మాత్రం పలు రకాల ఛార్జీలతో టిక్కెట్ల ధర మరింత పెరిగేలా చేస్తున్నాయి. IRCTC ద్వారా బుకింగ్ చేయడం ద్వారా, ప్రయాణీకులు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఆ రూట్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ 50 రోజులు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?
రైలు టిక్కెట్లపై డబ్బు ఆదా చేసుకునే టిప్స్
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ద్వారా ఈజీగా టికెట్లను బుక్ చేసుకోవడమే కాదు, తక్కువ ధరకు టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ప్రైవేట్ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటూ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సో, ఇకపై రైలు టికెట్ బుకింగ్ కోసం ఎలాంటి ప్రైవేట్ టికెట్ బుకింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా IRCTCని ఉపయోగించడం ఉత్తమం. ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా ఈజీగా, తక్కువ ఖర్చుతో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. IRCTC వెబ్ సైట్, యాప్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి నమ్మదగిన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇకపై మీరు రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే. కచ్చితంగా IRCTCని మాత్రమే ఉపయోగించండి. ఈ సైట్ మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడటమే కాకుండా దేశంలోని విస్తారమైన రైల్వే నెట్ వర్క్ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంది.
Read Also: నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్ల జారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!