TATA WPL 2025 Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కాబోతోంది. మార్చి 15న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 14న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సిబి – గుజరాత్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కి బరోడాలో కొత్తగా నిర్మించిన బీసీఏ స్టేడియం వేదిక కానుంది.
Also Read: Watch Video: కొన్ స్టాస్ కోసం ఫ్యాన్ ఆరాటం.. అంతలోనే భారీ యాక్సిడెంట్
ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషన్ మొత్తం నాలుగు వేదికలలో నిర్వహించబోతున్నట్లు బిసిసిఐ పేర్కొంది. బెంగళూరు, లక్నో, వడోదర, ముంబై వేదికలుగా ఈ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రం ముంబైలో జరుగుతాయని బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్ లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగుళూరు 8 మ్యాచ్లకు అతిథ్యం ఇవ్వనుంది. ఐదు జట్లు, కెప్టెన్ల వివరాలకు వస్తే.. స్మృతి మందాన (ఆర్సిబి), మెక్ లానింగ్ (ఢిల్లీ), అలిస్సా హీలి (యూపీ), హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై).
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్:
వడోదర:
14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్జ్
17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
19 ఫిబ్రవరి 2025 UP వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్
బెంగళూరు:
21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్
22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్జ్
23 ఫిబ్రవరి 2025 బ్రేక్ డే
24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్
25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs UP వారియర్జ్
27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
2 మార్చి 2025 బ్రేక్ డే
లక్నో:
3 మార్చి 2025 UP వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్
4 మార్చి 2025 బ్రేక్ డే
5 మార్చి 2025 బ్రేక్ డే
6 మార్చి 2025 UP వారియర్జ్ vs ముంబై ఇండియన్స్
7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
8 మార్చి 2025 UP వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9 మార్చి 2025 బ్రేక్ డే
ముంబై:
10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
12 మార్చి 2025 బ్రేక్ డే
13 మార్చి 2025 ఎలిమినేటర్
14 మార్చి 2025 బ్రేక్ డే
15 మార్చి 2025 ఫైనల్
Also Read: Sitamanshu Kotak: టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్.. ఎవరీ సితాంశు కోటక్ ?
ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు అన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి. స్పోర్ట్స్ 18 హెడ్/SD WPL 2025 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే ఉచితంగానే… Jio సినిమాస్‌లో WPL 2025 మ్యాచ్ లు వీక్షించవచ్చు.
Get ready for the excitement!
The TATA WPL 2025 schedule is here! Kicking off on February 14th and culminating in an epic final on March 15th, this season will light up Vadodara, Bengaluru, Lucknow, and Mumbai 😍🔥🏏#WPL2025 #Schedule #T20 #WomensCricket #Indiancricket… pic.twitter.com/YPBbwVsSdU
— InsideSport (@InsideSportIND) January 16, 2025