BigTV English

Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంజెక్షన్లు తీసుకుంటున్న కోహ్లీ !

Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంజెక్షన్లు తీసుకుంటున్న కోహ్లీ !

Virat Kohli: ఇటీవల టీమిండియా బ్యాటర్లు వరుసగా విఫలం చెందడంతో ఆటగాళ్లంతా దేశవాళీ మ్యాచ్ లలో ఆడాలని బీసీసీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో కనిపిస్తున్నారు. ఈ రంజీ ట్రోఫీలలో వీరి ప్రదర్శనను బట్టి జూన్ నెలలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కి జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.


Also Read: TATA WPL 2025 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీలో పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. 2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడిన కోహ్లీ.. ప్రస్తుతం తన రెడ్ బాల్ ఫామ్ పునరుద్ధరించేందుకు ఈ టోర్నీలో ఆడతారా..? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల మధ్య నెలకొంది. మరోవైపు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రీ వంటి ప్రముఖులు కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నారు. విరాట్ కోహ్లీ గత 13 ఏళ్లుగా ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు.


చివరిసారిగా 2012 నవంబర్ లో ఉత్తరప్రదేశ్ పై ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో ఆడారు విరాట్ కోహ్లీ. ఇందులోని మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 14 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేశారు. మళ్లీ ఇప్పటివరకు రంజి ట్రోఫీలో పాల్గొనలేదు. అయితే బీసీసీఐ ఈసారి సీరియస్ గా చెప్పడంతో కోహ్లీ రంజీల్లో ఆడతారేమోనని అంతా భావించారు. కానీ ఈసారి కూడా విరాట్ కోహ్లీ రంజి ఆడడం లేదని తెలుస్తోంది. రాజ్కోట్ లోని ఢిల్లీ టీమ్ తో విరాట్ కోహ్లీ కలుస్తాడని.. వారితో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నప్పటికీ మ్యాచ్ లు మాత్రం ఆడడం అనుమానమేనని సమాచారం.

ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుతం మెడ గాయంతో బాధపడుతున్నారట. ఈ నొప్పిని భరించేందుకు విపరీతంగా ఇంజక్షన్లు కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఒకవేళ గాయం నుంచి కోలుకుంటే జనవరి 23వ తేది నుండి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉన్నాయని పలు కథనాలు పేర్కొంటున్నాయి. విరాట్ కోహ్లీ 2024 సంవత్సరంలో టెస్టుల్లో 19 నాక్స్ లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 24.5 సగటుతో కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ పేలవమైన ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్ లో అతని భవిష్యత్తుపై చర్చలకు దారి తీసింది.

Also Read: Watch Video: కొన్ స్టాస్ కోసం ఫ్యాన్‌ ఆరాటం.. అంతలోనే భారీ యాక్సిడెంట్‌ 

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) సెక్రటరీ అశోక్ వర్మ రంజీ ట్రోఫీలలో విరాట్ కోహ్లీ తమ జట్టుకు ఆడాలని అభ్యర్థించారు. కానీ విరాట్ కోహ్లీ నుంచి తమకు ఇంకా ఎటువంటి ధ్రువీకరణ రాలేదని వారు తెలిపారు. 2025 డబ్ల్యుటిసి టెస్ట్ సిరీస్ ని భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించబోతోంది. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు 5 టెస్టులు ఆడబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కి కీలకం కానుంది. ఒకవేళ విరాట్ ఈ సిరీస్ లో విఫలం చెందితే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

 

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×