BigTV English

Pietersen Calls Ambati Rayudu a ‘joker’: అంబటి రాయుడు ‘జోకర్ ’ఎందుకయ్యాడు..?

Pietersen Calls Ambati Rayudu a ‘joker’: అంబటి రాయుడు ‘జోకర్ ’ఎందుకయ్యాడు..?

Kevin Pietersen Calls Ambati Rayudu a ‘joker’: కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ లో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. కామెంటేటర్ గా ఉన్న అంబటి రాయుడు మొదట ఆరెంజ్ కోట్ ధరించాడు. అంటే తను హైదరాబాద్ కి మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పకనే చెప్పాడు. అయితే అనూహ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.


దీంతో తనేం చేశాడంటే కుదురుగా ఉండకుండా ఆరెంజ్ కోట్ తీసి పక్కన పెట్టి, కోల్ కతా కలర్ బ్లూ కాబట్టి, తను బ్లూ కోట్ వేసుకుని మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోకి వచ్చాడు. అయితే అప్పటికే అక్కడ చేరుకున్న కామెంటేటర్లు ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్‌లు.. ఏం చేశారంటే అంబటి రాయుడు కోటు మార్చిన విషయాన్ని పసిగట్టి ఒక ఆట ఆడుకున్నారు.

మమ్మల్ని చూడు.. మేం మొదటి నుంచి ఒకటే కలర్ డ్రెస్ వేసుకు వచ్చాం. కోల్ కతా గెలుస్తుందని నమ్మాం. కానీ నువ్వు జోకర్ లా చేశావు. అది గెలిస్తే ఆరెంజ్ కోటు, ఇది గెలిస్తే బ్లూ కోటు అన్నచందంగా రెండు తెచ్చుకుని వచ్చావు.  అని ఒక రేంజ్ లో ఆట పట్టించారు.


Also Read: ఐపీఎల్ ముగిసింది.. టీ 20 ప్రపంచకప్ జోష్ మొదలు

అయితే అందుకు అంబటి రాయుడు ఏమన్నాడంటే, నేను రెండు జట్ల వైపు ఉంటాను. మంచి క్రికెట్ ను ఆస్వాదిస్తాను. నేను ఎవరి పక్షం కాదని అన్నాడు. కానీ తనిచ్చిన వివరణ.. ఆ స్థాయిలో సరిపోలేదు. మరోవైపు సహచర హోస్ట్ మయంతీ లాంగర్ మాట్లాడుతూ మా రాయుడు ఆరెంజ్ నుంచి బ్లూ రంగులోకి మారిన విషయాన్ని బయటపెట్టినందుకు.. మీ ఇద్దరికి ధన్యవాదాలు అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ఏమైందంటే.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఆర్సీబీపై అంబటి రాయుడు కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. విరాట్ కొహ్లీ పై కూడా మాట్లాడాడు. అయితే తను మంచిగా విమర్శించినా విరాట్ ఫ్యాన్స్ ఊరుకోలేదు. రాయుడు కనిపిస్తే చాలు ట్రోల్ చేసి పారేశారు.  అయితే ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా ట్రోల్ అయినంత కాదు గానీ, అంబటి రాయుడ్ని ఒక రేంజ్ లో ఆడుకున్నారు.

Also Read: All Eyes On Rafah : రోహిత్ శర్మ సతీమణి ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

మనవాడు ఘటికుడే..తను ఊరుకుంటాడా? ఆర్సీబీ ఫ్యాన్స్ ని గౌరవిస్తూనే, తను చెప్పాలనుకుంటున్నవన్నీ అంటిస్తూ పోయాడు. ఇప్పడు అనూహ్యంగా ఫైనల్ మ్యాచ్ లో తోటి కామెంటేటర్లు సరదాగా జోకర్ అన్న మాటలు విరాట్ ఫ్యాన్స్ కి ఆయుధంలా మారాయి.  ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×