IPL 2024 Ended Time for ICC T20 World Cup: సంతోషం ఎంత సేపు మనచుట్టూనే తిరుగుతుంటుంది. అందుకు ఆస్వాదించే మనసు ఉండాలి. ప్రస్తుతం ఐపీఎల్ అయిపోయిందని చింతించాల్సిన పనిలేదు. మరో ఐదురోజుల్లో టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్ వేడుకలకు ఐసీసీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
నిజానికి జూన్ 1న ప్రారంభం అవుతున్నా.. భారత కాలమాన ప్రకారం జూన్ 2న మనదేశంలో మొదలవుతుంది. మొత్తం 20 దేశాల జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ లో 5 దేశాలు ఉంటాయి. ఒకే గ్రూపులో ఒక దేశం.. మిగిలిన నాలుగుదేశాలతో ఆడుతుంది. అక్కడ తొలిరెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 కు క్వాలిఫై అవుతాయి.
సూపర్ 8లో కూడా రెండు గ్రూపులుగా చేస్తారు. ఒకొక్క గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి. ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో మ్యాచ్ లు ఆడుతుంది. అక్కడ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అలా రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లు సెమీ ఫైనల్ ఆడుతాయి. చివరికి రెండు జట్లు ఫైనల్ కి చేరతాయి.
Also Read: కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు ఎక్కడ?
ఐసీసీ ఈసారి టీ 20 ప్రపంచ కప్ లో కొన్ని నిబంధలను మార్చింది. ఒకవేళ మ్యాచ్ టై అయితే.. సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా టై అయితే, సెకండ్ సూపర్ ఓవర్ వస్తుంది. అదీ టై అయితే.. మరో సూపర్ ఓవర్.. ఇలా మ్యాచ్ తేలేవరకు సూపర్ ఓవర్ నడుస్తూనే ఉంటుంది.
ఒకవేళ వర్షం పడినా, ఇతర ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కనీసం 5 ఓవర్లయినా ఆడాల్సి ఉంటుంది. సెమీఫైనల్, ఫైనల్ మాత్రం 10 ఓవర్లు ఆడాలి. అలా సాధ్యం కాని పక్షంలో మ్యాచ్ రద్దు అవుతుంది. నిజానికి సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండాలి. అలా ఇవ్వలేదు. ఫైనల్ డేకు మాత్రమే ఇచ్చారు.
ఒకవేళ భారత్ సెమీఫైనల్ కు చేరితే గయానా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా నుంచే తిరుగుటపా కట్టేయవచ్చు. ఈ మ్యాచ్ లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. భారత అభిమానులకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే ట్రినిడాడ్ లో జరిగితే మాత్రం మ్యాచ్ ఉదయం 6 గంటలకే మొదలవుతుంది.
Also Read: Teamindia practice at New york: ప్రాక్టీసులో రోహిత్ సేన, తొలిరోజు కేవలం..
ఇక అన్నీ అనుకూలించే విదేశీ పిచ్ లు, ప్రతికూల వాతావరణం, వీటన్నింటిని దాటుకుని ఫైనల్ కి వెళ్లగలిగితే మాత్రం బార్బడోస్ వేదికగా ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ లో బ్రహ్మాండంగా ఆడిన 5 గురు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. మిగిలిన ఆరుగురు సరిగ్గా ఆడితేనే హార్డిల్స్ దాటుతామనే సంగతి అందరికీ తెలిసిందే.